స్త్రీ శక్తి" పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
నంద్యాల ప్రతినిధి. ఆగస్ట్ 15 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లాలో "స్త్రీ శక్తి" పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో కలిసి రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయా శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రారంభించారు.నంద్యాల పట్టణంలోని బస్టాండ్ నుండి బనగానపల్లె కు వెళ్ళే బస్ సర్వీస్ లో జిల్లా కలెక్టర్, సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి.. మహిళా సోదరీమణులతో కలిసి బస్సులో ప్రయాణించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ ఫేర్ టికెట్ ను అందించి ఉచిత బస్సు ప్రయాణంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.ఈ బస్సు ప్రయాణంలో ఆయా మహిళల ఆర్ధిక పరిస్థితులు, సాధకబాధకాలు, స్త్రీశక్తి పథకం మహిళలకు ఎంతమేరకు ఉపయోగరమనే విషయాలు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్న మంత్రి.కూటమి ప్రభుత్వ పాలన, సంక్షేమ – అభివృద్ధి కార్యక్రమాలపై బస్సులో మహిళా ప్రయాణీకుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న మంత్రి.ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అంటూ తమ అభిప్రాయాలను మంత్రితో పంచుకున్న మహిళా సోదరీమణులు.కూటమి ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఇచ్చిన హామీ మేరకు స్త్రీ శక్తి పథకంను అమలు చేస్తున్నామని, మహిళలంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఫింఛన్ రూ. 3 నుంచి 4 వేలకు పెంచడం, అన్నదాత సుఖీభవ, తల్లికివందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు విజయవంతంగా అమలు చేశాం.. తాజాగా నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం సంతోషకరం.తొలుత ఉచిత బస్సు ప్రయాణం జిల్లా వరకే పరిమితం చేయాలని ఆలోచించినప్పటికీ, మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించాం.ఈ పథకంలో భాగంగా (పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్) 5 రకాల బస్సుల్లో.. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీ కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు.ఈ పథకం వల్ల మహిళలకు రూ. 1500 నుంచి రూ. 3 వేలు వరకు నెలకు ఆదా అయ్యే పరిస్థితి.నేడు రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తోంది.ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో.. అదనపు బస్సుల అవసరం ఉంటుందని భావించి, కొత్త బస్సులకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్ ఇవ్వడం జరిగింది.ఉచిత బస్సు ప్రయాణం వల్ల చిరు వ్యాపారులకు, ఉద్యోగులకు, దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్ధినులకు ఈ పథకం ద్వారా ఆర్ధికంగా వెసులబాటు కల్పిస్తోంది.
Comment List