నంద్యాల లో 508 మొబైల్ ఫోన్ లు రికవరీ- ఎస్పి
నాల్గవ విడత ప్రతిష్టాత్మకం గా “ మొబైల్ రికవరీ మేళా ” కార్యక్రమం
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
ఏ పి డిజిపి హరీష్ కుమార్ గుప్త ఆదేశాలమేరకు మరియు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపిఎస్ పర్యవేక్షణలో ఐపిఎస్ ఆద్వర్యంలో మొబైల్ రికవరీచేయడం జరిగింది. ఈ మొబైల్ లను వివిద రాష్ట్రలనుండి అనగా మహారాష్ట్ర, తమిళనాడు ,కర్ణాటక, గోవా , తెలంగాణా మొదలగు రాష్ట్రాల నుండి మరియు ఆంద్రప్రదేశ్ లోని విశాఖపట్టణం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం మొదలగు జిల్లాల నుండి మరియు నంద్యాల జిల్లాలో వివిద ప్రాంతాల నుండి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలను సైబర్ ఇన్స్పెక్టర్ వంశీధర్ వారి సిబ్బంది మొత్తం 508 మొబైల్ ఫోన్ లు రికవరీ చేయడం జరిగింది.వీటి విలువ సుమారు 83,82,000/- రూపాయలు ఉంది. జిల్లాలోనే అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 508 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు.నంద్యాల జిల్లా పోలీసులు ముందు రోజే ఫోన్ల ను అందజేసేందుకు బాధితులకు సమాచారం అందించి నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంకు పిలిపించి బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు.మరికొన్ని మొబైల్ ఫోన్లను వారి వారి డిఎస్పి ఆఫీసులకు పంపించి బాధితులకు అందజేయాలని ఆదేశించారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మిడియాతో మాట్లాడారు. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. మొబైల్ లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తామన్నారు అలాగే వ్యక్తి గత సమాచారం , బ్యాంకింగ్ సమాచారం మొదలగున్నవి ఆ మొబైల్ లలో ఉంటాయి కాబట్టి మొబైల్ ని జాగ్రత్త గా ఉంచుకోవాలి అని సూచించడం జరిగినది.జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న భాదితులు ఇచ్చిన వివరాలను బట్టి 508 ఫోన్లు రికవరీ చేశామన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరి అయిన వాటి పరిష్కారం పై నంద్యాల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నంద్యాల జిల్లాలో మొబైల్ పోగొట్టు కున్నా వ్యక్తి ముందుగా 9121101107 అనే నంబర్ వాట్స్ యాప్ కు HAI అని మెసేజ్ చేసినట్లైతే ఒక లింక్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ లింక్ ను క్లిక్ చేసి ఈ క్రింది వివరాలను మీ పేరు, మీ జిల్లా , మీ పోలీస్ స్టేషన్ పరిధి , మీ మొబైల్ పోగొట్టుకున్న స్థలము , మీ మొబైలు కు సంబంధించిన ఇమేయి-1, ఇమెయ్- 2 వివరాలు మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నంబర్ / మొబైలు పోయినప్పుడు సదరు మొబైల్ నందు మీరు వాడినా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ వివరాలు సబ్మిట్ చేయాలి.అలాగే ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారు CEIR పోర్టల్ గురించి విదిగా తెలుసుకొని దానిలో కూడా ఫిర్యాదు చేసిన కూడా పోలీస్ వారు మీ మొబైలు ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comment List