స్పందించిన అధికారులు.
వేగవంతంగా రహదారి మరమ్మత్తులు.
శిరివెళ్ల :(నంది పత్రిక)
సిరివెళ్ల మండల పరిధిలోని యర్రగుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో ప్రధాన రహదారి కుంగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల పట్ల అధికారులు స్పందించారు. తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టారు. ఉదయం ఎంపీడీవో సి శివమల్లేశ్వరప్ప అధికారులు ఈఓ అశ్విని కుమార్ ఆధ్వర్యంలో కుంగిన పరిశీలించారు.వెంటనే తక్షణ చర్యలలో భాగంగా పనులు చేపట్టాలని ఆదేశించిన కారణంగా గురువారం ఈఓ అశ్విని కుమార్ సర్పంచ్ శుభాన్ వలి ఆధ్వర్యంలో కుంగిన రహదారి వద్ద జెసిబి సహాయంతో పనులు చేపట్టారు. రహదారిని గ్రావెల్ తో నింపి చదును చేశారు. ప్రజా సమస్యలను వెలికి తీసిన 48 గంటలలోపే పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈవో అశ్విని కుమార్ రహదారి మరమ్మత్తు పనులు దగ్గర ఉండి పూర్తిచేసి రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారి లోని కల్వర్టు వద్ద ముళ్ళకంప పోదలను సైతం తొలగించి గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు.
Comment List