రైతులు మోసపోయి తక్కువ ధరకు కందులను ఇవ్వొద్ధు.
బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో, ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రం ను ఏర్పాటు చేయడం మైనది.ఈ కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు సి హెచ్. మద్దిలేటీ స్వామి,పి.రామ మోహన్, శనివారం పరిశీలించడం జరిగింది. కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్న రైతులను,రైతు సంఘం నాయకులు అక్కడి పరిస్థితులను రైతులను అడిగారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ బేతంచెర్ల మండలం లోని అన్ని గ్రామాలలో కంది పంటను సుమారు 30 వేల ఎకరాలలో సాగు చేశారని, కొనుగోలు కేంద్రాలు రంగాపురంతో పాటు,ప్రతి గ్రామంలోనూ ఏర్పాటుచేస్తే ఉపయోగంగా ఉంటుందన్నారు.ఇతర గ్రామాలనుండి ఇక్కడికి కందులు తీసుకొని రావాలంటే రవాణా ఖర్చుల భారం పడుతుందన్నారు. ఈ సంవత్సరంలో అధిక వర్షాలు కురువడం వల్ల,పంటదిగుబడి బాగా తగ్గిందన్నారు. ప్రభుత్వం ఎకరాకు ఆరు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుందని, తేమ శాతం 12 కు మించి ఉంటే అధికారులు తీసుకోవడం లేదని జల్లాడ వేస్తే చాలా నష్టపోవలసి వస్తుందని రైతులు క్వింటాకి 130 రూపాయలు ఖర్చవుతుందని వాపోయారు. రైతు సంఘం నాయకులు అధికారులతో మాట్లాడుతూ హమాలీ ఖర్చు ప్రభుత్వమే భరించాలని, రవాణా చార్జీలు ప్రభుత్వమే భరించాలని, రైతులు అధిక వర్షాల వల్ల చాలా నష్టపోయారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆలస్యం చేసినందువలన,రైతులు దళారులకు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోయారని, ఉన్న కొంతమంది రైతుల కందులను ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మండలంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ,అధికారులకు తెలిపారు.మార్క్ ఫెడ్ అధికారులు మాట్లాడుతూ తేమశాతం 12 ఉన్న,ప్రతి రైతు కందులను కొనుగోలు చేస్తామని, రోజుకు 40 క్వింటాలు కొనుగోలు చేస్తున్నామని, ఇంతవరకు 15 వందల క్వింటాల్లు కొనుగోలు చేశామని, రైతుసంఘము నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ అధికారులు, రైతులు, హమాలీలుపాల్గొన్నారు.

Comment List