ప్రైమ్ హాస్పిటల్ లో రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం

On

133b6cda-7fa4-4cf4-ae0f-9c38081d8dce*ప్రైమ్ హాస్పిటల్ లో రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం*
*👉. నంద్యాలలో ప్రధమంగా ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ (పునరావాస)కేంద్రం*
*👉. ఏర్పాటుచేసిన డాక్టర్ నాగరాజా రెడ్డి, డాక్టర్ భారతి*
*👉. ప్రారంభించిన డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదన రావు*
*👉. చికిత్సల తరువాత పూర్తిస్థాయిలో సాధారణ జీవనానికి ఈ కేంద్రం ఒక వరం: డాక్టర్ రవి కృష్ణ*
నంద్యాల సిటీ బ్యూరో నవంబర్ 11 ( నంది పత్రిక )
        నంద్యాలలో సలీం నగర్ ప్రాంతంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలో ఉన్న ప్రైమ్ హాస్పిటల్ లో ప్రముఖ అత్యవసర చికిత్స నిపుణులు డాక్టర్ డి.న్.రాజారెడ్డి, ప్రముఖ న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ భారతీ రెడ్డి ఏర్పాటుచేసిన పూర్తిస్థాయి రిహాబిలిటేషన్ సెంటర్ ( చికిత్స తర్వాత పునరావాస కేంద్రం) మంగళవారం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు. 
                ఈ సందర్భంగా డాక్టర్ డి.న్.రాజారెడ్డి,ప్రముఖ న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ భారతీ రెడ్డి మాట్లాడుతూ పక్షవాతం,మూత్రపిండ, గుండె,ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి,ప్రమాదాలలో ఎముక విరిగిన వారికి,వృద్ధులు,పిల్లలలో నరాల సమస్యలు ఉన్న వారు,తిరిగి సాధారణ జీవనాన్ని గడపడానికి ఈ కేంద్రం ఉపకరిస్తుందన్నారు. రోగులకు పూర్తిస్థాయిలో రిహాబిలిటేషన్ ( పునరావాస) కోసం ఈ కేంద్రంలో ఖరీదైన అత్యంత ఆధునిక పరికరాలు నగరాలకు దీటుగా నంద్యాలలో ఏర్పాటు చేశామన్నారు.
                 డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఈ కేంద్రంలో చికిత్స తర్వాత స్వతంత్ర జీవనశైలి సాధ్యం అవుతుందని,మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని,జీవిత నాణ్యత పెరుగుతుందని అన్నారు. ఈ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
                     డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ
పునరావాసం అంటే రోగి తిరిగి తన సాధారణ జీవితానికి చేరుకునే మార్గమని,వ్యాధి, గాయం లేదా శస్త్రచికిత్స తర్వాత శరీర పనితీరును తిరిగి సాధించడానికి,రోజువారీ కార్యకలాపాలను స్వతంత్రంగా చేయడానికి,ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి,తిరిగి ఆసుపత్రిలో చేరే అవకాశాన్ని తగ్గించడానికి,కుటుంబం మరియు సమాజంలో రోగి స్థానం పునరుద్ధరించడానికి దోహదపడుతుందన్నారు. 
      ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పట్టణ వైద్యులు రాకేష్ రెడ్డి,విజయ భాస్కర్ రెడ్డి,అనిల్ కుమార్,శ్రీనివాసరావు,సోమశేఖర్ రెడ్డి,నెట్ల మహేశ్వరరెడ్డి,రవికాంత్ రెడ్డి, నర్మద,కల్పన,మాధవి, నెట్ల శిల్పా తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News