సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.!
On

పట్టించుకోని వ్యవసాయ విస్తరణ అధికారులు
వెల్దండ ప్రతినిధి అక్టోబర్ 17 ,: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల రైతులకు ఇటీవల వేరుశనగ విత్తనాలు అందజేయడం జరిగింది. వివరాలలోకి వెళితే.. వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి శంకరయ్య 1 ఎకరం 20 గుంటల విస్తీర్ణంలో పల్లి విత్తనాలను నాటాడు. విత్తనాలను నాటీ 13 రోజులు గడుస్తున్నా.. నేటికీ మొలకెత్తక పోవడంతో రైతు రోధిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు మండలి ఎల్లయ్య పరిస్థితి కూడా అలాగే వుంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని మిగతా రైతులు ప్రభుత్వం అందించిన సబ్సిడీ పల్లి విత్తనాలను వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయ విస్తరణ అధికారి శోభారాణిని ఫోన్లో సంప్రదించగా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.
Tags: #viral #update
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Oct 2025 10:31:15
జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక)
మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు

Comment List