రాయలసీమ ద్రోహి జగన్.. అభివృద్ధి చేసింది ఒక్క టీడీపీనే : మంత్రుల ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి
*రాయలసీమ ద్రోహి జగన్.. అభివృద్ధి చేసింది ఒక్క టీడీపీనే : మంత్రుల ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల ఫిబ్రవరి 6
నంద్యాల... గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి, ఇప్పుడు కేవలం రాజకీయ ఉనికి కోసం, తిరుమల లడ్డు కల్తీ పాపాన్ని పక్కదారి పట్టించడానికే వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బి.సి. జనార్ధన్ రెడ్డి మరియు నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శుక్రవారం నంద్యాలలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సీమ ప్రాజెక్టుల పితామహుడు ఎన్టీఆర్ అని
రాయలసీమ కరువు తీర్చడానికి తెలుగు గంగ, ఎస్ఆర్.బిసి వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌దేనని గుర్తు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో రూ. 12,000 కోట్లు ఖర్చు చేసి జిల్లాలోని అన్ని చెరువులకు నీరు అందించామని, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 13 పంపులను ప్రారంభించి రైతులకు అండగా నిలిచామని తెలిపారు.
అనుమతులు లేని ప్రాజెక్టులతో దోపిడీ
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ప్రారంభించి, కేవలం మట్టి పనుల పేరుతో జగన్ తన అనుచరుల జేబులు నింపుకున్నారని. అనుమతులు లేనందున ఎన్.జిటీ జరిమానా వేసినా, అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ స్టేను తొలగించే ప్రయత్నం ఎందుకు చేయలేదు?" అని నిలదీశారు. అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యం జగన్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు.
తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయినప్పుడు కేవలం 5 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయించి రబీ పంటలను కాపాడిన ఘనత చంద్రబాబుదని . వైసీపీ ఐదేళ్లలో కేవలం రూ. 2,000 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే రూ. 8,000 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. 'యువగళం' పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వేల ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకొస్తున్నామని వెల్లడించారు. జగన్ నిజంగా రాయలసీమ బిడ్డ అయితే, అసెంబ్లీకి వచ్చి సీమ అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రులు సవాల్ విసిరారు.
*లడ్డు వివాదం నుండి తప్పించుకోవడానికే 'చలో పోతిరెడ్డిపాడు
తిరుమల లడ్డు అపవిత్రతపై ప్రజల్లో వస్తున్న ఆగ్రహాన్ని తట్టుకోలేక, దాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు ఇప్పుడు 'చలో పోతిరెడ్డిపాడు' వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రులు ఎద్దేవా చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన సొంత ఊరిలో కట్టిన షాదీఖానాకే నిధులు తెచ్చుకోలేకపోయారని మంత్రి ఫరూక్ విమర్శించారు. అభివృద్ధిపై చర్చించే అర్హత వైసీపీ నేతలకు లేదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి మనుగడ ఉండదని వారు స్పష్టం చేశారు.

Comment List