వైభవంగా మహానందీశ్వరుడి రథోత్సవం

On

మహానంది

31a99125-e7d6-440b-916b-47481e642fa48dbf958e-a5f2-4cf1-857d-120563678d1bb7ee8f4a-8e46-4e02-86eb-b84128425b7fవైభవంగా మహానందీశ్వరుడి రథోత్సవం
మహానంది. ఫిబ్రవరి 17. నంది పత్రిక :మహానంది ప్రసిద్ధ శైవక్షేత్రంలో మంగళవారం సాయంత్రం మహానందీశ్వర స్వామివారి రథోత్సవం అపూర్వ వైభవంతో నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు. రథోత్సవ వేడుకలతో క్షేత్ర ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగి భక్తిరసపూరిత వాతావరణం నెలకొంది.ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పూర్ణకుంభ స్వాగతంతో ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్ఠించి రథయాత్ర ప్రారంభించారు. సంప్రదాయ వాయిద్యాలు, మంగళవాయిద్యాల మధ్య రథం ఆలయ ప్రదక్షిణ మార్గంలో నడిపారు. భక్తులు ఓం నమశ్శివాయ నినాదాలతో రథాన్ని లాగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుండి భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తులకు త్రాగునీరు, ప్రసాదం తదితర సదుపాయాలు ఆలయ అధికారులు సమకూర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి రద్దీని సమర్థవంతంగా నియంత్రించారు.సాయంత్రం జరిగిన రథోత్సవం మహానంది క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తులకు కనులపండువగా మారింది.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు. మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు.
మురుగు జలపాతం చూడండి...స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు...శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా....రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.నంద్యాల జులై 9 ( నంది...
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా