శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన

On

శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన
 
శ్రీశైలం మార్చి 09(నంది పత్రిక) 
శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి   ఆలయానికి విచ్చేసి శ్రీ స్వామిఅమ్మవార్లను సేవించారు.ఈ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతి వారికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద  కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, అర్చకస్వాములు, వేదపండితలు, ఆలయ విభాగం అధికారులు సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో స్వాగతంపలికారు.  అనంతరం వారు  శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను నిర్వహించారు. 
తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించబడింది.తరువాత గురువందన కార్యక్రమం జరిపించబడింది. అనంతరం మహాస్వామివారు అనుగ్రహ భాషణం చేశారు.  ఈ సందర్భంగా వారు సనాతన ధర్మం యొక్క విశిష్టత, శ్రీశైలక్షేత్ర మహిమా విశేషాలు, శివానందలహరి – సౌందర్యలహరి స్తోత్రాల విశేషాలను వివరించారు. fd53bcfc-cfb4-4da7-af2b-c145a040434bమహాస్వామివారు భక్తులందరికీ ఆశీర్వచనాలను అందజేశారు.
Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు. మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు.
మురుగు జలపాతం చూడండి...స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు...శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా....రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.నంద్యాల జులై 9 ( నంది...
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా