రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ విజన్ బడ్జెట్

On

మంత్రి ఎన్ఎండి ఫరూక్

dbbbeb60-317c-4a68-a73f-dffd2f3e1f80రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ 'విజన్ బడ్జెట్'

మైనార్టీల సంక్షేమానికి రూ. 6,090 కోట్లు, న్యాయ వ్యవస్థకు రూ. 349 కోట్లు కేటాయింపు*

రూ. 3,32,205 కోట్లతో చారిత్రాత్మక బడ్జెట్: మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల సిటీ బ్యూరో ఫిబ్రవరి 15 ( నంది పత్రిక )

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం గణాంకాల పుస్తకం కాదని, ఇది కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే "విజన్ డాక్యుమెంట్" అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఈ సందర్భంగా నంద్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రూ. 3,32,205 కోట్లతో భారీ బడ్జెట్‌ను రూపొందించిన ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి గారికి అభినందనలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనుల కోసం (మూలధన వ్యయం) రూ. 53,915 కోట్లు కేటాయించడం జరిగిందని. విజన్ 2047 లక్ష్యంగా, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన అభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది వేస్తుందని అన్నారు. మొత్తం సంక్షేమ రంగానికి అత్యధికంగా రూ. 91,527 కోట్లు కేటాయించారని. మైనార్టీల సంక్షేమానికి రూ. 6,090 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 51,021 కోట్లు, ఎస్సీలకు రూ. 20,644 కోట్లు, మరియు ఎస్టీలకు రూ. 9,190 కోట్లు కేటాయించి సామాజిక న్యాయాన్ని కాపాడారని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ. 27,719 కోట్లు కేటాయించడం ద్వారా వృద్ధులకు, పేదలకు అండగా నిలిచామన్నారు. కోర్టు భవనాలు, నివాస గృహాల నిర్మాణానికి రూ. 349 కోట్లు కేటాయించడమే కాకుండా, 100 కొత్త కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపామని . అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 6,600 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ. 11,000 కోట్లు కేటాయించామన్నారు. పాఠశాల విద్యకు రూ. 32,308 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ. 19,306 కోట్లు కేటాయించి సామాన్యుడికి నాణ్యమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 12.3% వడ్డీతో అప్పులు చేసి రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెడితే, మన కూటమి ప్రభుత్వం దానిని 9%కి తగ్గించి ఆర్థిక భారాన్ని తగ్గించిందని. అంతేకాకుండా, ఇప్పటివరకు వివిధ విభాగాల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు భరోసానిచ్చామని మంత్రి ఫరూక్ గారు స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి వంటిదని, ప్రతి వర్గపు ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా రూపొందించబడిందని మంత్రి ఫరూక్ తెలిపారు

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News