ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్. ...రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల దృశ్య ప్రవేటు బస్సులపై కఠినచర్యలు ?

On

IMG_3861ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్.
...రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల దృశ్య ప్రవేటు బస్సులపై కఠినచర్యలకు శ్రీకారం చుట్టనున్నారు.
...ప్రవేటు బస్సుల్లో స్లీపర్ సౌకర్యానికి మంగళం పాడేందుకు 3 నెలల్లో ప్రణాళికలు సిద్ధం చేయనున్న ప్రభుత్వం.
...ప్రవేటు బస్సులు 50 శాతం కూడా స్టాండర్స్ పాటించడం లేదని గుర్తించి న అధికారులు.
...ప్యాసింజర్స్ ను ఆకట్టుకునేందుకు అనా కారిక   డిజైన్లు.
...స్లీపర్ బస్సులో ఇద్దరు పడుకొని ప్రయాణం చేయాలన్నా ఇరుకుగా ఉండటాన్ని గమనించిన అధికారులు.
...ప్రవేటు బస్సులకు ఫిట్నెస్ సరిగా లేకపోయినా పైసల కు కక్కుర్తి పడి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు గుర్తించిన అధికారులు.
... ఏటిసి సెంటర్లో జరుగుతున్న అక్రమాలవల్లె ప్రవేటు బస్సుల్లో ఫిట్నెస్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు.
...దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రవేటు బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు లేకుండా ఒక్క డ్రైవర్తో సరిపెట్టుకోవడంతో నిద్రలేమితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు.
...ప్రవేటు బస్సులు సులభంగా మంటలు అంటుకునే మెటీరియల్ వాడుతున్నట్టు గుర్తించారు.
...ఆంధ్రప్రదేశ్ లో తరచూ ప్రవేటు బస్సుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.
...ఆరునెలల్లో 145 మంది మృత్యువాత పడ్డారు,వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు.
...రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్వయంగా ప్రవేటు బస్సులోని అత్యవసర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి పరిశీలిస్తున్నారు.
...ప్రవేటు బస్సుల్లో 50 శాతం ప్రభుత్వ నిబంధనలు పాటించడంలేదని గుర్తించారు.
...ప్రవేటు బస్సుల్లో ప్రమాదాలు నివారించడానికి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో ప్రవేటు బస్సుల్లో స్లీపర్ కోచ్ బస్సులపై కొరడా రులిపించనుంది.
...ప్రవేటు బస్సుల్లో పుష్ బ్యాక్ సీట్లు ప్రయాణికుడి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టనున్నారు.
... ఏటిసి సెంట్ల పై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్టు సమాచారం.
...ఆర్టీవో అధికారులు కాకుండా ఏటిసి సెంటర్లో జరుగుతున్న ఫిట్నెస్ సర్టిఫికెట్లు జరిపే ప్రత్యేక టీం నియమించనున్నట్టు సమాచారం.
...రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రవేటు బస్సుల సంఖ్య ,ఫిట్నెస్ వివరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.
...ఆర్టీవో కార్యాలయాల్లో దళారుల పాత్ర పై అధికారులు దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.
...ఆర్టీవో కార్యాలయాల్లో అవినీతి నిర్మూలించడానికి ప్రభుత్వం దాడులు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
...ఇకపై ఆర్టీవో అధికారులు ప్రతి నెల ప్రవేటు బస్సులు తనికీలు.
...ప్రవేటు బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లు,క్లీనర్ ల పూర్తి వివరాలు,ఆరోగ్య సమస్యలు పై పూర్తి వివరాలు తీసుకోవాలతున్న ప్రభుత్వం.
...కొన్ని ప్రాంతాల్లో ఒక్క అనుమతిపై రెండు మూడు బస్సులు నడుపుతున్నట్టు తనికిల్లో వెలుగులోకి వచ్చినట్టు గుర్తించిన అధికారులు.
...ప్రయాణికులు సైతం ప్రవేటు బస్సుల్లో సౌకర్యాలు సరిగా లేకపోతే సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలన్న అధికారులు.
...మరోవైపు ప్రయాణికులు కొందరు తమ మాటల్లో ప్రభుత్వ బస్సులు సరిగా లేకపోవడంతోనే ప్రవేటు బస్సులను ఆశ్రయిస్తున్నామని,డోర్ ప్రాంతాలకు వెళ్ళే బస్సులో నాని సౌకర్యాలు బాగుంటే ప్రవేటు బస్సులపై ఆసక్తిచూపమని చెప్పుకొస్తున్నారు.
...రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రవేటు బస్సులు తనికీలు చేస్తున్నా నంద్యాలలో ఆర్టీఓ అధికారులు తనికీలు చేయడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
..ప్రవేటు బస్సులతో పాటు ప్రవేటు పాఠశాలలు,కళాశాలల బస్సుల్లో అధికంగా విద్యార్థులను ఎక్కించుకొని పోవడం,ప్రధాన రహదారుల్లో సైతం ఓవర్ స్పీడ్ గా వెళుతున్నా చర్యలు శూన్యం.
...ప్రవేటు పాఠశాలల బస్సుల వేగానికి ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం బయట నడవాలన్నా భయం,భయంగా ప్రజలు వెళుతున్నారు.
..ప్రమాదాలు జరగక ముందే అధికారులు ప్రవేటు బస్సులు,ప్రవేటు పాఠశాలలు,కళాశాలల బస్సులపై తరచూ తనికీలు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు.
...ఆర్టీవో అధికారులు కార్యాలయానికి పరిమితం కాకుండా కనీసం నెలకు ఒకసారైనా తనిఖీలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతారని ఆశిద్దాం.
...లంచాలు ముఖ్యం కాదు..ప్రజల ప్రాణాలు ముఖ్యమని గుర్తిస్తారని ఆశిద్దాం.
...నంద్యాలలో గత ఆరునెలల్లో ఒక్కసారి కూడా ప్రవేటు బస్సులు తనికీలు చేసినట్టు చూడలేదని మేధావులు పేర్కొంటున్నారు.
...ఒకటి మాత్రం వాస్తవం నంద్యాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఏ అధికారి కూడా ప్రతి నెల వారు చేసిన పనులు మీడియా కు కానీ ప్రజలకు కానీ చెప్పకుండా గోప్యంగా ఉంచడం నంద్యాల అధికారులకే సాధ్యం.
...కాంగ్రెస్,వైసిపి ప్రభుత్వ హయంలో ప్రతినెల అధికారులతో నేతలు రివ్యూ సమావేశాలు పెట్టీ అభివృద్ధిపై చర్చించేవారు.
...కూటమి ప్రభుత్వ హయంలో రెండేళ్లు దాటుతున్నా ఒక్క శాఖలో కూడా రివ్యూ సమావేశం పెట్టీ అభివృద్ధిపై చర్చించిన దాఖలాలు కనిపించడం లేదు.
..నంద్యాలలో జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ తప్ప ఏ అధికారి ప్రజలకు తెలిసేవిదంగా ఒక్క సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్. ...రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల దృశ్య ప్రవేటు బస్సులపై కఠినచర్యలు ? ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్. ...రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల దృశ్య ప్రవేటు బస్సులపై కఠినచర్యలు ?
ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్....రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల దృశ్య ప్రవేటు బస్సులపై కఠినచర్యలకు శ్రీకారం చుట్టనున్నారు....ప్రవేటు బస్సుల్లో స్లీపర్ సౌకర్యానికి మంగళం పాడేందుకు 3 నెలల్లో ప్రణాళికలు సిద్ధం చేయనున్న ప్రభుత్వం....ప్రవేటు...
నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల  పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.
శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు
మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం
జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు
10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం.