గాజులపల్లెలో భారీ అగ్నిప్రమాదం

On

GridArt_20260222_234955306

మహానంది, పల్లె వెలుగు మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని మెట్ట నుంచి మహాదేవపురం గ్రామానికి వెళ్లే దారిలోని బిస్కెట్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో విద్యుత్ ఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మంటలు ఎగిసి పడుతుండటాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు శక్తికిమించి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు నంద్యాల అగ్నిమాపకశాఖ సిబ్బంది సమాచారం అందజేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో పలురకాల యంత్రాలు, బిస్కెట్లు తయారు చేసేందుకు ఉపయోగించే పలు రకాల పదార్థాలు, విద్యుత్ పరికరాలు కాలి పోయాయని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు. మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు.
మురుగు జలపాతం చూడండి...స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు...శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా....రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.నంద్యాల జులై 9 ( నంది...
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా