ఇన్ స్పయిర్ మరియు ఎన్.ఎం.ఎం.ఎస్ లో మోడల్ స్కూల్ విద్యార్థుల హవా

On

0e529fe6-6e74-4f8a-8485-67c746cdfc25

బేతంచెర్ల మార్చి 5 (నంది పత్రిక ).

 బేతంచర్ల మండలం గోరుమానుకొండ మోడల్ స్కూల్ విద్యార్థులైన 9.వ తరగతి మంజునాథ్ రూపొందించిన ''బ్లూ టెక్ డీజిల్'', 8.వ తరగతి సాయి దత్త రూపొందించిన "యాంగిల్స్ ఇన్ సస్టెండెడ్ సర్కిల్" అనే రెండు సైన్స్ మోడల్స్ జిల్లా స్థాయి  సైన్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ కి ఎంపిక కావడం జరిగింది. మరోవైపు బుధ వారం విడుదలైనటువంటి జాతీయ స్థాయి ఎన్.ఎం.ఎం.ఎస్. స్కాలర్ షిప్ కు 8 వ తరగతికి చెందిన శ్రీ సాయి దత్త, అబ్దుల్ అజీం, మహీధర్, నవనీత్, మధు సాయి సందీప్, ఝాన్సీ రాణి అనే 6 మంది విద్యార్థులు ఎన్నిక కావడం జరిగింది. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎన్నికైనటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 9వ తరగతి నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వం 10 వేలు రూపాయల స్కాలర్ షిప్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ టి.మరియ దాస్ విద్యార్థులను, దీనికోసం కృషి చేసిన ఉపాధ్యాయులైన రూపకల్పన, ఈజస్ అహ్మద్, ఈశ్వరి కుమారి ,చిన్న రంగమ్మ, విజయభాస్కర్ లను అభినందించి మాట్లాడుతూ, మోడల్ స్కూల్లో విద్యార్థులు సైన్స్ ఇన్స్పైర్ అవార్డుకి మరియు ఎన్ఎంఎంఎస్ కి ఎన్నిక కావడం చాలా సంతోషకర మైనటువంటి విషయమని, ప్రభుత్వం అందించే ఫలాలు,ప్రతి పేద విద్యార్థికి అందించడం కోసం,పాఠశాల ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సహకారంతో,గోరుమాను కొండ మోడల్ స్కూల్ నుంచి  విద్యార్థులను ఐ.ఐ.టి, త్రిబుల్ ఐ.టీ, జే.ఈ.ఈ., ఎంసెట్ ,నీట్ ,సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని,భవిష్యత్తులో మంచి ప్రతిభను సాధించేలా, విద్యార్థులకు మంచి దిశా నిర్దేశం చేస్తామని  తెలియజేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం
- ఎంఈసీ, సీఈసీ విభాగాల్లో స్టేట్ టాపర్లుగా విద్యార్థులు - ఎంపీసీ, బైపిసి లోనూ మార్కుల పంట- ⁠.. ఫలితాల్లో సత్తా చాటిన న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు...
తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్
శ్రీ శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి హుండీ లెక్కింపు
ఈ నెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ వేసవి దృష్ట్యా సమయ మార్పు
ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్. ...రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల దృశ్య ప్రవేటు బస్సులపై కఠినచర్యలు ?
నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల  పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.
శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు