ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం

On

IMG_4189
- ఎంఈసీ, సీఈసీ విభాగాల్లో స్టేట్ టాపర్లుగా విద్యార్థులు - ఎంపీసీ, బైపిసి లోనూ మార్కుల పంట
- ⁠.. ఫలితాల్లో సత్తా చాటిన న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు

నంది పత్రిక :ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్థానిక న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు.గురువారం విడుదలైన ఫలితాల్లో వివిధ విభాగాల్లో అత్యధిక మార్కులతో స్టేట్ టాపర్లుగా నిలిచి కళాశాల కీర్తిని చాటారు. ముఖ్యంగా ఎంఈసీ, సీఈసీ విభాగాల్లో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులను సొంతం చేసుకున్నారు. టాపర్లు వీరే.. జూనియర్ ఎంఈసీ: 500 మార్కులకు గాను పవిత్ర అవెంజలిన్ 495 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలవగా, లిఖిత (494), కావ్య (494),కుసుమ (492) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మొత్తం ఐదుగురు 490కి పైగా మార్కులు సాధించారు.జూనియర్ సీఈసీ: మయేషా,తబసుమ్, కుముదిత 493 మార్కులతో స్టేట్ టాపర్లుగా నిలిచారు. జూనియర్ ఎంపీసీ: బి. ధరణి. 470. , కె.సాయి 466 మార్కులు సాధించగా.. మొత్తం 31 మంది విద్యార్థులు 460 మార్కులు దాటారు. జూనియర్ బైపీసీ: ఎస్. ఫౌజియ సయ్యద్ సన 4558 గాను 451 మార్కులతో సత్తా చాటారు.సీనియర్ ఎంపీసీ
విభాగంలోనూ జోరు: సీనియర్ ఎంపీసీలో బి. పూజిత, ధరణి లక్ష్మి 1000కి గాను 989 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. డి.భాను (987), జి. తన్న్మయి రెడ్డి (986) ఉత్తమ ప్రతిభ కనబరిచారు.సీనియర్ బైపీసీలో ఎస్.రమ్స్టియా (985), బి.మౌనిక (982) అత్యధిక మార్కులు సాధించగా, సీనియర్ ఎంఈసీలో ఆర్.పి.ఉత్తేజ్ (965), సీఈసీలో సి.ఎల్.ఆర్.గాయత్రి (950) అత్యుత్తమ మార్కులు సాధించారు. అధ్యాపకుల కృషితోనే విజయం: అత్యధిక మార్కులతో విజయం సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, డైరెక్టర్ వాసుదేవరెడ్డి ఘనంగా అభినందించారు. క్రమశిక్షణతో కూడిన బోధన, విద్యార్థుల కఠోర శ్రమ, అధ్యాపకుల పర్యవేక్షణ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ విజయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం