ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 

On

ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా IMG-20260421-WA0005IMG-20260421-WA0005IMG-20260421-WA0006

నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 21 .  (నంది పత్రిక ):ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ సంఘం పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం పిఅర్టియూ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి ల అధ్యర్యంలో మహా ధర్నాను చేపట్టారు.వెయ్యి మంది ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.అధికారంలో వచ్చాక ఉద్యోగ , ఉపాధ్యాయులకు మెరుగైన పిఅర్సి, ఐఆర్, పెండింగ్ డిఎ లు వంటి అంశాలపై హామీ ఇచ్చిన ఇంత వరకు నెరవేర్చకపోవడం శోచనీయం అని వెంటేనే పిఅర్సి కమిషన్ ఏర్పాటు చేసి, 30% ఐఆర్ చెల్లిస్తూ పెండింగ్ డిఎ లు విడుదల చేయాలని కోరారు.
పిఅర్టియూ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పాలకుల నిర్లక్ష్యం ఉద్యోగ, ఉపాధ్యాయుల పై అలాగే కొనసాగుతుందని, దీనిని అడ్డుకుంటామని, సిపిఎస్  రద్దు చేయాలని, 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ వర్తింపు చేయాలి, మెమో 57 అమలు పరచాలని, 2022 నుంచి పెండింగ్ లో వున్న సరెండర్ లీవ్ చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి మాట్లాడుతూ అనేక ఆశలతో ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 2 సంవత్సరాలైన మన ప్రధాన డిమాండ్లను పెండింగ్ లో పెట్టడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా ఉందని, ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు అన్ని చెల్లించాలని, రిటైర్ అవుతున్న ఉపాధ్యాయులకు వారి పదవీ విరమణ రోజే వారి చెందాల్సిన ప్రయోజనాలు చెల్లించాలని, ఏమ్టిఎస్ ఉపాధ్యాయులైన డిఎస్సి 1998,2008 వారిని రెగ్యులర్ చేయాలి , వారికి 12నెలల జీతం చెల్లించాలి అని కోరారు.అలాగే ఎయిడెడ్, మున్సిపల్, మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ, కేజీబీవీ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి అని కోరారు.చాలా పెద్ద ఎత్తున ఎండ వేడి లెక్క చేయకుండా ఉపాధ్యాయులు నిరసన గళం ఎత్తారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 25 తేదీన చలో విజయవాడ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ కి ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో పిఅర్టియూ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ భార్గవ రామయ్య,రాష్ట్ర నాయకులు కె కృష్ణారావు, గోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయ్ రావు, ఇబ్రహీం, రాంపుల్ల రెడ్డి, మధుసూదన్, వై.వి.రమణయ్య, పి నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, హనుమంతు, రవీంద్ర రెడ్డి, జాకీర్ కె శ్రీనివాసులు , ఎస్ ఎమ్ బాషా, జేసీ నరసింహులు, సుమియన్, జగదీశ్ బాబు, సుధాకర్ రెడ్డి జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులుమహిళా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం