కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం

On

*కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం*
*👉. 25  వ సంవత్సరం  "కళా సాధన" పేరిట ఉచిత శిక్షణ శిబిరాలు*
*👉. మే 1వ తేదీ నుండి  జూన్ 2వ తేదీ వరకు.*
*👉. జూన్ ,2 వ తేదీన  శిక్షణ పొందిన వారిచే ముగింపు ఉత్సవంలో ప్రదర్శనలు*
నంద్యాల సిటీ బ్యూరో ఏప్రిల్ 27 ( నంది పత్రిక )
కళారాధన సాంస్కృతిక సంస్థ, నంద్యాల ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత లలిత కళలు,క్రీడల వేసవి శిక్షణ శిబిరం ఈ సంవత్సరం మే ఒకటవ తేదీ నుండి జూన్ 2 వ తేదీ వరకు *"కళా సాధన -2026"*
పేరిట నంద్యాల కే.ఎన్.ఎం. మున్సిపల్ స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది.ఈ శిక్షణ శిబిరం లో  శాస్త్రీయ నృత్యం,ఆధునిక నృత్యం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం ,వాద్యసంగీతంలో గిటార్,కీబోర్డ్,మిమిక్రీ,వెంట్రిలాక్విజం,చిత్రలేఖనం,చక్కటి చేతివ్రాత ,హస్తకళలు,ఫ్యాబ్రిక్ పెయింటింగ్,పద్య పఠనం, సంస్కృత శ్లోకాలు,కవితా గానం,కవితా రచన, చదరంగం,కరాటే, టైక్వాండో, వ్యక్తిత్వ వికాసం వంటి  అంశాలలో 25 మంది కోచ్ లతో శిక్షణా శిబిరాలు నిర్వహించడం జరుగుతాయని కళారాధన అధ్యక్ష కార్యదర్శులు  డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవి కృష్ణ,ప్రోగ్రాం కోఆర్డినేటర్ రంగనాథ్, కార్య నిర్వాహక  కార్యదర్శులు రవి ప్రకాష్, అన్నెం శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ రెండవ తేదీన ముగింపు ఉత్సవం లో శిక్షణ పొందిన బాలబాలికల చేత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రం అందజేస్తామని తెలిపారు. శిబిరంలో శిక్షణ పొందడానికి, ముగింపు ఉత్సవంలో  ప్రదర్శనలు ఇవ్వడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.IMG-20260427-WA0017వేసవి సెలవులను బాలలు, యువత సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు. కళలు, క్రీడలు బాలల మానసిక, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. కళారాధన కార్య నిర్వాహాక కార్యదర్శులు రవి ప్రకాష్,అన్నెం శ్రీనివాసరెడ్డి, రంగనాథ్ ల పర్యవేక్షణలో కోచ్ లు కళ్యాణి, లలితా సరస్వతి, సుభాషిని,రజాక్, సుదర్శనం, బాలకృష్ణ, నాగేంద్ర, రాజేంద్ర, శివకుమార్, సతీష్ ,మధు, రాజా ,ఆది, తరుణ్, సీతారాం, రాజ్ కుమార్, సత్యనారాయణ,  శిబిరంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:8142962974,7989627760,6300715927

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు. మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు.
మురుగు జలపాతం చూడండి...స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు...శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా....రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.నంద్యాల జులై 9 ( నంది...
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా