నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు 

On

GridArt_20260207_231739006

రాష్ట్రప్రభుత్వ ఆదేశాలమేరకు రాజమహేంద్రవరం నగరంలో ఈరోజు ఆహార భద్రతా అధికారులు మరియు లీగల్ మెట్రోలజీ అధికారులు జాయింట్ గా తనిఖీలు నిర్వహించారు. 10 మంది ఆహార భద్రతా అధికారులు మరియు లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్స్ కలిసి 5 టీంలు గా ఏర్పడి సుమారు 30 ఆహార పదార్థాలు అమ్మే యూనిట్ల పై తనిఖీలు నిర్వహింంచారు.

 ఈ తనిఖీలలో ముఖ్యoగా హోటళ్ళు, రెస్టారెంట్లు, బిర్యాని సెంటర్లు, స్వీట్ షాపులు, స్వీట్ తయారీ కేంద్రాలు, బేకరీ లను తనిఖీ చేసారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టాము (Food Safety and Standards Act, 2006) కింద వివిధ కేసులను నమోదు చేశారు. అందులో

 

1) 20 ఆహార పదార్థముల శాంపిళ్లను స్టేట్ ఫుడ్ లేబరటరీ, హైదరాబాద్ కు పంపించారు. ఇందులో చికెన్ బిర్యానిలు, చికెన్ ఫ్రై, వంటకు వాడే వంట నూనెలు, యందు జంతు కళేబరాలు నుండి సేకరించిన వంట నూనెలు ఉన్నాయనే అనుమానంతో శాంపిలళ్లు ప్రయోగ శాల కు నిర్ధారణ కై పంపితిరి . స్వీట్ల తయారీ లో కృత్రిమ రంగులు వాడుతున్నారనే దాని పై నిర్ధారణ కు శాంపిళ్ల ను సేకరించిరి.

 

      2) కుళ్ళి పోయి న మాంసము, మసాలా పేస్ట్ లు, వండి నిల్వయుంచిన మాంసాహార పదార్థములను 

           సీజు చేసి డిస్ట్రాయ్ చేసితిరి. కేసులు నమోదు చేసితిరి. సుమారు 174 కేజీ లు ఆహార పదార్థములు    

         రూ. 62000/- విలువ చేసేదానివి వినియిగమునకు పనికి రానందు న నిర్వీర్యం చేసితిరి.

3) స్టోర్ రూమ్ లలో expired ఫుడ్స్ మరియు నిషేధిత రంగులు పాడై పోయిన గుడ్లు, బేకరీ ఐటమ్స్ ను సీజు చేసితిరి  4) న్యూస్ పేపర్ల తో బ్రెడ్, కేక్ లు, తయారు చేయుచున్నట్లు గా గుర్తించి వాటిని సీజు చేసితిరి

             ఫుడ్ సాంపిల్స్ విశ్లేషణ రిపోర్టులు వచ్చిన పిదప సంబందిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ పై Food Safety and Standards Act, 2006 మరియు రెగ్యులేషన్లు, రూల్స్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకొనబడును. ఈ తనిఖీలలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News