నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్
నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.
15 లక్షల విలువచేసే బంగారు వెండి నాగాలతో పాటు నగదు స్వాదినం.
నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్.
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపీఎస్,
నంద్యాల జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ముద్దాయిల వివరాలు వెల్లడించారు.
షేక్ బాబావలి, తండ్రి షేక్ కరీముల్లా, వయస్సు 25 సం లు, వైయస్సార్ నగర్, ఇంటి నెంబర్ 25-450-2B-109, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా అని తెలిపారు.
రికవరీ చేసిన సొత్తు వివరాలు*
98 గ్రాముల బంగారు నగలను, 400 గ్రాముల వెండి వస్తువులను మరియు 54,500/-నగదు,
మొత్తం విలువ సుమారు 15 లక్షలు స్వాదినం చేసుకోవడం జరిగిందని తెలిపారు.2025 వ సంవత్సరము నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలలో అనగా నంద్యాలతాలూకా,బండిఆత్మకూరు,రేవనూరు,సంజామల,గడివేముల,బేతంచర్ల,అవుకు మొదలగు పోలీసు స్టేషన్ ల పరీదులలో దొంగతనాలకు పాల్పడుతూన్న నేరస్తుల గురుంచి నిఘా ఉంచాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి కుమారి ఎం. జావళి ఆల్పోన్స్ ఐపీఎస్ ఆద్వర్యంలో నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఆర్.ఈశ్వరయ్య , సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ కుమార్ నిఘా ఉంచడం జరిగింది. 03.04.2026 వ తేదీ వె నందమూరి నగర్ రోడ్, నాగులకట్ట దగ్గర వున్న టి జంక్షను వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి నంబర్ ప్లేట్ లేని పల్సర్ మోటార్ సైకల్ వస్తు పోలీసు వారిని చూసి మోటార్ సైకల్ ను తిప్పుకొని పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని పట్టుకొని విచారించడం జరిగిందని తెలిపారు.ఇతడు జల్సాలకు అలవాటుపడి పలు పోలీసు స్టేషన్ ల పరీదులలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతు ఉండేవాడు అని అన్నారు.ఈ సందర్బంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఐపీఎస్, మరియు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి కుమారి ఎం. జావళి ఆల్పోన్స్ ఐపీఎస్ నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషిoచిన నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఆర్.ఈశ్వరయ్య , సి సి ఎస్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ కుమార్ ,నంద్యాల తాలూకా పి ఎస్ సిబ్బంది, బి.రవికుమార్, ఎం.గంగాధర్ మరియు సి సి ఎస్ సిబ్బంది హెచ్ సి ఎస్, ఇబ్రహిం, పి సి ఎస్ మలిక్ బాష, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, గంగారం మరియు కృష్ణమ నాయుడు లను ఎస్పీ ప్రత్యేకముగా అభినందిచారు.

Comment List