అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం

On


-పాఠశాల అభివృద్ధికి ప్రణాళిక

అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంIMG-20260504-WA0016
-పాఠశాల అభివృద్ధికి ప్రణాళిక 

నంద్యాల ప్రతినిధి. మే 04.  (నంది పత్రిక ):శ్రీ రామకృష్ణ విద్యాలయం, నంద్యాల 1985-86 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దాదాపు 160 మంది పెద్ద సంఖ్యలో పాల్గొని పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను మళ్లీ ఆస్వాదించారు.కార్యక్రమం ఉపాధ్యాయులకు సత్కారం, అనుభవాల పంచుకోలు, వినోదాత్మక ఆటలు, పాటలు, నృత్యాలతో కళకళలాడింది. 
ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా ఆటపాటలతో నృత్యాలతో ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించడం ఆహ్లాదంగా అనిపించింది.ప్రస్తుత సోషల్ మీడియా వేదికల ద్వారా పూర్వ విద్యార్థులు ముందే అనుసంధానమై ఉండటంతో ప్రత్యేక పరిచయాల కార్యక్రమం నిర్వహించలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంలో వచ్చిన సూచనలను గౌరవంగా స్వీకరిస్తూ, భవిష్యత్తులో మరింత సమగ్రంగా కార్యక్రమాలను ప్రణాళిక చేయనున్నట్లు ఒక పూర్వ విద్యార్థి, నిర్వాహకులలో ఒకరైనటువంటి లయన్ రవి ప్రకాష్ పేర్కొన్నారు.ఈ సమ్మేళనం మా జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. పాత స్నేహాలను మళ్లీ గుర్తు చేసుకునే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉంది,” అని ఒక పూర్వ విద్యార్థి దుబాయ్ నుండి వచ్చిన ఆర్కిటెక్ట్ భాను ప్రకాష్, బెంగళూరు నుండి వచ్చిన బ్యాచ్ ssc టాపర్ సంపత్ లు పేర్కొన్నారు.అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ముఖ్యంగా నంద్యాల ప్రాంత పూర్వ విద్యార్థులు ధనుంజయ్, శివ రమేష్, సుబ్బయ్య, మురళి, చంద్ర మోహన్, రమణ, శ్రీను రమణా రెడ్డి తదితరులు చేసిన కృషి ప్రశంసనీయం,” అని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వాహకులు మరియు ఆర్థికంగా సహకరించిన అందరికీ పూర్వ విద్యార్థులు రైల్వే ఆఫీసర్ శైలేంద్ర, విద్యుత్ శాఖ అధికారి కృష్ణమూర్తి, నీటి పారుదల శాఖ అధికారి విజయ్ తదితరులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ నివర్తి మోహన్ కుమార్ మరియు విశ్రాంత ఉపాధ్యాయులు ఆంజనేయులు, సుబ్బారెడ్డి, నరసింహ రావు, మల్లికార్జున శెట్టి , రామ్మూర్తి , సుబ్బరాయుడు ఇలాంటి సమ్మేళనాలు పూర్వ విద్యార్థుల మధ్య బంధాన్ని మరింతబలపరుస్తాయని,భవిష్యత్తులో కూడా ఇవి కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో వివిధ నగరాల నుండి దేశాలనుండి దూర ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, కుటుంబ సమేతంగా పెద్ద విశేషం.ఈ విశేషం పురస్కరించుకుని గత నెలలోనే పాఠశాలలో దాదాపు లక్షకు పైగా విలువైన ఫ్లోరింగ్, వాటర్ ట్యాంక్, పెయింటింగ్ తదితర మరమ్మతులు బ్యాచ్ తరపున చేపట్టడం జరిగింది.పూర్వ విద్యార్థులైన రఘునాథరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగరాజు,  శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ ఇకమీదట పాఠశాల అభివృద్ధికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్కూలు యాజమాన్యంతో చర్చించి, ఇతర పూర్వ విద్యార్థుల బ్యాచులతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News