తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం కలిగిస్తాయి

On

డాక్టర్ రవి కృష్ణ

6d19c78e-6234-403b-a0dd-4ef78be07406

తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు
క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం కలిగిస్తాయి: ఆదాయ పన్ను అధికారి రమణారావు
తైక్వాండో బెల్ట్ లు ప్రదానం చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, రమణారావు, డాక్టర్ రవి కృష్ణ

కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష పోటీలలో 140 మంది తైక్వాండో క్రీడాకారులు పాల్గొని వివిధ కేటగిరి బెల్ట్ లు సాధించారు.ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్ టి చంద్రమౌళి ఆధ్వర్యంలో, మాస్టర్ బాలకృష్ణ నిర్వహణలో, కర్నూలు జిల్లా మాజీ ఒలంపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రదానోత్సవం లో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లా ఆదాయ పన్ను అధికారి రమణారావు,నంద్యాల జిల్లా క్రీడాభారతి అధ్యక్షులు సుధాకర్ అతిధులుగా పాల్గొని క్రీడాకారులకు వివిధ కేటగిరి బెల్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఆదాయ పన్ను అధికారి రమణ రావు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం, శారీరిక దారుఢ్యం, మానసిక వికాసం, క్రమశిక్షణ,  ఏకాగ్రతలను ఇనుమడింపచేస్తాయని అన్నారు. సుధాకర్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచుతుందని అన్నారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తైక్వాండో ఒలింపిక్ లో గుర్తింపు పొందిన క్రీడ అని అన్నారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం