ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

On

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ .

 

 ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు.

* సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ .

వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు  ట్రావెల్స్ ఏజెన్సీల పేరుతో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను ప్రచారం చేస్తూ, తక్కువ ధరల్లో దేశీయ మరియు విదేశీ పర్యటనలు అందిస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  బుధవారం తెలిపారు.

మోసం చేసే విధానం:

సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు ఇవ్వడం.

ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు తక్కువ ఖర్చుతో ప్యాకేజీలు అంటూ నమ్మించడం
అడ్వాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి, తరువాత సంప్రదింపులు నిలిపివేయడం
నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ రివ్యూల ద్వారా మోసం చేయడం.

జిల్లా ఎస్పీ  జిల్లా ప్రజలకు సూచనలు చేశారు.

* ఏ ట్రావెల్స్ ఏజెన్సీ అయినా ముందుగా ధృవీకరించాలి.

* అధికారిక వెబ్‌సైట్, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించాలి.

* అనుమానాస్పదంగా తక్కువ ధరల ప్యాకేజీలను నమ్మవద్దు.

* ముందస్తు చెల్లింపులు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

* రశీదు లేకుండా డబ్బులు చెల్లించవద్దు.

సైబర్ నేరాలపై అప్రమత్తత...

ప్రజలు సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

సైబర్ మోసాలకు గురైన వెంటనే గంటలోపే

 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి.

 www.cybercrime.gov.in (నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్) లో ఫిర్యాదు నమోదు చేయాలి.


ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి 

లేదా

Dial  112 / 100 కు సమాచారం ఇవ్వండి.

ప్రజల అప్రమత్తతే మోసాల నివారణకు ముఖ్యమైన ఆయుధం అని ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  తెలిపారు.IMG-20260429-WA0008

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం