ఎగ్జిబిషన్ "శ్రీను"కు ఘన సత్కారం

On

eb5b1cc0-e508-4b40-84e8-b2cb00ef18deఎగ్జిబిషన్ "శ్రీను"కు ఘన సత్కారం

నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 16. (నంది పత్రిక ):నంద్యాల పట్టణ ప్రధమనంది  సమీపంలో రెండు నెలల పాటు ఎగ్జిబిషన్ కొనసాగించిన నిర్వాహకుడు శ్రీనును సోమవారం ఘనంగా సత్కరించారు.. సీనియర్ ఫోటోగ్రాఫర్ చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు టిడిపి సీనియర్ నాయకులు జిల్లెల్ల శ్రీరాములు తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎగ్జిబిషన్ లో అయోధ్య రామాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, శ్రీను ఎంతో సృజనాత్మకంగా ఆలయ నమూనాను ఏర్పాటు చేశారని, బాల రాముని ప్రతిమ ఈ ప్రాంత వాసులను ఎంతో అలరించిందని పేర్కొన్నారు.చింతలపల్లి వాసు మాట్లాడుతూ రామాలయ నమూనా రాముని విగ్రహం ఏర్పాటుతో ఎగ్జిబిషన్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందన్నారు.వందలాదిమంది సందర్శకులు ,చిన్నారులు ఆలయ నమూనాను ఆసక్తిగా తిలకించాలని పేర్కొన్నారు.డాక్టర్ గెలివి సహదేవుడు బాల రాముని వైభవాన్ని , ఆలయ విశిష్టతలను వివరించారు.ప్రజలలో భక్తి భావాన్ని పెంచిన  ఎగ్జిబిషన్ నిర్వాహకులను అభినందించారు.టిడిపి నాయకుడు జిల్లెల్ల శ్రీరాములు మాట్లాడుతూ బాల రాముడు విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజల సందర్శనార్థం ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. సన్మాన గ్రహీత శ్రీను మాట్లాడుతూ అయోధ్య రాముడిని చూసిన అనుభూతిని సందర్శకుల లో కలిగించాలనే భావనతో ఈ ఆలయ నమూనా ఏర్పాటు చేశామని అద్భుతమైన రీతిలో ప్రజాదరణ లభించడం తన అదృష్టం అన్నారు. తనను సత్కరించిన నంద్యాల వాసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పాలూరు సుబ్బారావు ,మారంశేషయ్య తదితరులు పాల్గొన్నారు.3ab6f0a0-58e5-4e41-bf95-78b2e969c2a1

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు. మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు.
మురుగు జలపాతం చూడండి...స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు...శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా....రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.నంద్యాల జులై 9 ( నంది...
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా