నెల రోజుల పాటు ఎముకలు,కీళ్ళ ఉచిత ఓ.పి. వైద్య సేవలు

On

నెల రోజుల పాటు ఎముకలు,కీళ్ళ ఉచిత ఓ.పి. వైద్య సేవలు
-రంజాన్ మాసం పురస్కరించుకుని ఉచిత వైద్య సేవలు ప్రశంసనీయం
-మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్
-ప్రముఖ ఎముకలు, కీళ్ల నిపుణులు డాక్టర్ మహమ్మద్ రఫీ వైద్య సేవలు అందిస్తారు
-ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి
-డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదన రెడ్డి

నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 16. (నంది పత్రిక ):పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఈనెల 18వ తేదీ నుండి వచ్చే నెల రంజాన్ పండుగ వరకు స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న జి ఎస్ ఆర్ ఆసుపత్రిలో ప్రముఖ ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ మహమ్మద్ రఫీ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలందరికీ ఉచిత ఓపి వైద్య సేవలు అందిస్తారు.ఈ ఉచిత వైద్య సేవల పోస్టర్స్ ను సోమవారం రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ మహమ్మద్ రఫీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ప్రముఖ మానసిక వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఆరీఫా బాను పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని డాక్టర్ మహమ్మద్ రఫీ ఉచిత వైద్య సేవలు నెలరోజులపాటు అందించడం ప్రశంసనీయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు.నంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో పలువురు వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు.

4b0431e5-3a34-4d82-afac-8376a7ea16d6

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం