ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బేతంచెర్ల ( నందిపత్రిక )
ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 19 వ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకొని బేతంచెర్ల పట్టణం పాత బస్ స్టాండ్ సెంటర్ భారత్ బేకరీ దగ్గర ప్రజాశక్తి విలేఖరి జి.వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు ఇ. వెంకటేశ్వర గౌడ్ కేక్ కట్ చేసి మాట్లాడుతూ జర్నలిజం ఈ దేశంలో,ప్రపంచంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. పాత్రికేయులు ఇంకా ఐక్యమై ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటాలన్నారు. ఎపి డబ్ల్యూజెఎఫ్ బేతంచెర్ల మండల కార్యదర్శి వై. నాగమధు పాత్రికేయుల నుద్దేశించి మాట్లాడారు. సీనియర్ పాత్రికేయులు & ఆడ్వకేట్ నందిపల్లె నారాయణ జర్నలిస్టుల సమస్యలపై సమావేశంలో మార్లాడారు.పాత్రికేయులకు ఏపీ. డబ్ల్యూజెఎఫ్ 19 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమలో ఉదయం పత్రికా విలేఖరి డి.దస్తగిరి, ఉత్తేజిత పత్రిక విలేఖరి కె.సుబ్బరాయుడు, సాక్షి విలేఖరి పి.భూపాల్ నాయుడు,తెలుగుప్రభ విలేఖరి వి. సుబ్బరాయుడు, విశాలాంధ్ర విలేఖరి బండ రాముడు, బిఆర్కె.నాగరాజు, సుధీర్ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

Comment List