కర్నూల్‌లో గంజాయి రవాణా ముఠా అరెస్ట్

On

GridArt_20250915_130255857

కర్నూలు: జిల్లాలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు IV టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఈ ఘనత నమోదైంది. సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జె. బాబు ప్రసాద్ నేతృత్వంలో, కల్లూరు తహసిల్దార్ శ్రీ ఆంజనేయులు, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ముఠా సభ్యులు ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని కర్నూలుకు రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో, పోలీస్ విచారణ వేగవంతం చేశారు. తెల్లవణి టయోటా గ్లాంజా (AP 40 N 3258) కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిపై పోలీసులు అనుమానం నెలకొనడంతో కారును డ్రైవర్లు బలవంతంగా ఆపి తనిఖీ చేశారు.

20 కేజీ గంజాయి, కారు సీజ్

విచారణలో వారు అరకు నుంచి వచ్చినట్టు వెల్లడించగా, ఇంకా లోతుగా దర్యాప్తు చేయగా కారు డోర్లలో ప్లాస్టిక్ రాపర్లలో చుట్టిన 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 80,000 రూపాయలకు గంజాయిని కొనుగోలు చేసి, ఒక్కో పాకెట్ రూ. 500 చొప్పున అమ్ముకుని మొత్తంగా రూ. 4 లక్షలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ముఠా సభ్యులు కర్నూలుకు వచ్చినట్టు వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలీసులు టయోటా గ్లాంజా కారును సీజ్ చేశారు. ఈ కేసులో ఐదుగురు యువకులు అరెస్ట్ అయ్యారు. వారు:

- మీనుగ నరేంద్ర (మాదన్న నగర్, పంచలింగాల, కర్నూలు)
- నల్లగొట్టి ఉమేష్ చంద్ర (ధర్మపేట, కర్నూలు)
- సిరిగిరి మృత్యుంజయ రెడ్డి (ఎస్‌ఎస్ నగర్, జిల్లా కోర్టు సమీపం, కర్నూలు)
- షేక్ మహమ్మద్ ఆరిఫ్ (ఎస్బీఐ కాలనీ, కర్నూలు)
- పగిద్యాల చాకలి గోవర్ధన్ (కొత్తపేట, కర్నూలు)

 తల్లిదండ్రులకు పోలీసుల విజ్ఞప్తి

పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, ఎవరైనా గంజాయికి అలవాటు పడుతున్నారని కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అప్పుడు వారికి మానసిక కేంద్రాల్లో చికిత్స అందించగలామని పోలీసులు తెలిపారు. పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News