కలెక్టర్ మేడం నా మొరను ఆలకించండి.

భర్త పేరుతో ఉన్న పొలం నా పేరు మీద చేయడానికి అర్జీ ఇచ్చి తాసిల్దార్ కార్యాలయానికి తిరగబట్టి నాలుగు నెలలు అవుతుంది.
ఏదైనా ఖర్చు అయితే ఖర్చు కూడా ఇచ్చుకుంటాను. నా భర్త పొలం నా పేరు మీద ఆన్లైన్ చేయండి.
నంద్యాల రూరల్ తాసిల్దార్ కార్యాలయంలో భూమి రిసర్వ్ డిటి నాగరాజు, కానాల వీఆర్వో ప్రియాంకకు పైసలిస్తేనే పనులు చేస్తున్నట్లు విమర్శలు.
పల్లె వెలుగు నంద్యాల.
మండల పరిధిలోని కానాల గ్రామంలో నివాసం ఉంటున్న సయ్యద్ ఫాతిమాభి భర్త లేట్ సయ్యద్ హుస్సేన్ సాహెబ్ అను నేను నా భర్త చనిపోయి సుమారు రెండేళ్లవుతుంది. కానాల పొలిమేరలో 531 సర్వే నెంబర్ నందు 1.30 సెంట్ల పొలము ఉన్నది.1.30 సెంట్ల పొలంలో నా భర్త బతికి ఉండంగానే నా పెద్ద కుమారునికి 0. 65 సెంట్ల పొలాన్ని నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగినది. మిగతా 0.65 సెంట్ల పొలాన్ని నా పేరు మీద ఆన్లైన్ చేయడానికి నేను నంద్యాల తాసిల్దార్ కార్యాలయంలో మా యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల తో పాటు నా భర్త డెత్ సర్టిఫికెట్, నా భర్త పేరు మీద వున్న పొలం డాక్యుమెంట్లను, పొలం పాస్ బుక్ అర్జీ రూరల్ ఇంచార్జ్ తాసిల్దార్ శ్రీనివాసులు కు ఇవ్వడం జరిగింది. తాసిల్దార్ ఇన్సెల్ వేసి పొలం రీ సర్వే డిటి నాగరాజు కు అర్జీ పంపడం జరిగింది. రీ సర్వే డిటి నాగరాజు కానాల వీఆర్వో ప్రియాంకకు పంపించడం జరిగినది. ఇచ్చిన అర్జీ విషయంపై నేను రూరల్ ఇంచార్జ్ తాసిల్దార్ శ్రీనివాసులు కు చాలాసార్లు కలవడం జరిగింది. ఇంచార్జ్ తాసిల్దార్ శ్రీనివాసులు పొలం రి సర్వే డిటి నాగరాజుకు పిలిపించి అర్జీ విషయంపై అడగగా నాగరాజు వీఆర్వో ప్రియాంక పై చెప్పడం జరిగింది. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ సుమారు మూడు, నాలుగు నెలలు అవుతుంది. నేను రూరల్ ఇంచార్జ్ తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడానికి నాకు ( 75 ) సంవత్సరాలు వయస్సు మీద పడడంతో కార్యాలయం చుట్టూ తిరగలేకపోతున్నాను. చాలాసార్లు పొలం రీ సర్వే డిటి నాగరాజును కలవగా నాగరాజు వి ఆర్ ఓ కు చెప్పడం వి ఆర్ ఓ నాగరాజు మీద చెప్పడం ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకోవడమే తప్ప నాకు సంబంధించిన పని ఏమాత్రం చేయడం లేదని, నా పని కోసం ఏదైనా ఖర్చు అయితే ఖర్చు కూడా ఇస్తానని తెలిపిన ఏమాత్రం పలకడం లేదని, రూరల్ ఇన్చార్జ్ తాసిల్దార్ శ్రీనివాసులు చాలాసార్లు రీ సర్వే డిటి, వీఆర్వో ను ఇద్దరిని పిలిచి మందలించిన పలకడం లేదని, దేవుడు కనికరించిన ,పూజారి వరం ఇవ్వడంలేదని అనే చందముగా నా సమస్య ఈ విధముగా తయారయ్యిందని బాధితురాలు తెలిపారు . నేను తిరగలేక నా పెద్ద కుమారుడు ఈనెల 19వ తేదీన రూరల్ ఇన్చార్జి తాసిల్దార్ శ్రీనివాసులు ను మరల కలవగా తాసిల్దార్ శ్రీనివాసులు కానాల వీఆర్వో ని పిలిపించి విషయం అడగగా వీఆర్వో త్వరలో అయిపోతుంది అని చెప్పడమే తప్ప పని చేసిన దాఖలాలు లేదని బాధితురాలు తెలిపారు. బాధితురాలు కుమారుడు చాలాసార్లు భూమి రిసర్వే డీటి నాగరాజును కలవగా కానాల పొలం విషయం మొత్తం ఒక కోలికి వచ్చిందని కానాలలో కేవలం నలుగురి రైతుల పొలం ముటేషన్ చేయలేదని తెలిపారు. పొలం రిసర్వే డీటి నాగరాజు, కానాల వీఆర్వో ప్రియాంకకు పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారని, పైసలు ఇవ్వకుంటే ఏమాత్రం పనులు చేయకుండా రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని భారీగా విమర్శలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న కానాల రైతు చనిపోవడంతో అతని పొలం వారి కుమారుల పేరిట ఆన్లైన్ చేయడానికి పొలం రి సర్వే డిటి నాగరాజు రైతు నుండి సుమారు 6 లక్షల రూపాయలు తీసుకుని మృతి చెందిన రైతు కుమారుల పేట ఆన్లైన్ చెయ్యడం జరిగిందని బాహాటముగా విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లా అధికారులు స్పందించి రి సర్వే డిటి నాగరాజు పై ప్రత్యేక అధికారుల నియమించి నాగరాజు చేసిన అవుక తోకల రికార్డులు పరిశీలించాలని రైతులు వాపోతున్నారు. పొలం రీ సర్వే డిటి నాగరాజు తన హోదాకు మించి ఆస్తులు కూడాపెట్టాడని, తన ఆస్తులపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేయాలని రైతులు వాపోతున్నారు. సెప్టెంబర్ 23వ తేదీన నూతన తాసిల్దార్ శ్రీవాణి రూరల్ తాసిల్దార్ కార్యాలయములో బాధ్యతలు చేపట్టారని, రూరల్ తాసిల్దార్ శ్రీవాణి కి కూడా విషయం తెలపడం జరిగిందని బాధితురాలు కుమారుడు తెలిపారు. ఏదేమైనా జిల్లా కలెక్టర్ స్పందించి బాధితురాలైన ఫాతిమాభి కి 531 సర్వే నంబర్ లో తన భర్త పేరుట ఉన్న 0.65 సెంట్ల పొలం బాధితురాలు ఫాతిమా బి పేరున ఆన్లైన్ చేయాలని బాధితురాలు కోరారు.
# 531 సర్వేనెంబర్ పొలం సమస్య రూరల్ తాసిల్దార్ శ్రీవాణి దృష్టికి. అర్జీదారులకు న్యాయం చేస్తాం రూరల్ తాసిల్దార్ శ్రీవాణి.#
కానాల పొలం 531 సర్వేనెంబర్ నా దృష్టికి వచ్చిందని రూరల్ తాసిల్దార్ శ్రీ వాణి తెలిపారు. సెప్టెంబర్ నెల 23వ తేదీన బాధ్యతలు చేపట్టానని నంద్యాల రూరల్ తాసిల్దార్ శ్రీవాణి తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీవాణి మాట్లాడుతూ 531 సర్వేనెంబర్ పొలం విషయము తమ దృష్టికి రాలేదని కొత్తగా బాధ్యతలు చేపట్టానని అన్నారు. కానాలలో ఒక రైతు వద్ద ఆరు లక్షల రూపాయలు భూమి రిసర్వే డిటి నాగరాజు తీసుకున్నట్లు అతనిపై వస్తున్న ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకుంటామని అన్నారు. 531 సర్వే నంబర్ పొలం ఫైల్ తెప్పించుకొని బాధితురాలకు న్యాయం చేస్తానని ఆన్లైన్ చేయడానికి ఎటువంటి పైసలు ఖర్చు కాదని రూరల్ తాసిల్దార్ శ్రీవాణి తెలిపారు.
# కానాల రిసర్వే పొలం విషయంలో రైతుల నుండి ఎటువంటి పైసలు తీసుకులేదు పొలం రీసర్వే డీటి నాగరాజు.#
కానాలలో రీ సర్వే ప్రకారం పొలం ఆన్లైన్ చేయడానికి కానాల రైతుల నుండి ఎటువంటి పైసలు తీసుకోలేదని, కానాలలో రైతు మృతి చందాగా వారి కుమారుల వద్ద ఆరు లక్షల రూపాయలు తీసుకున్నట్లు నాపై నిందలు వేస్తున్నారే తప్ప నేను ఎవరి వద్ద కూడా నయా పైసా తీసుకోలేదని పొలం రిసర్వే డిటి నాగరాజు తెలిపారు. రీ సర్వేలో తేలిన పొలం విషయంలో కానాల గ్రామం నందు నలుగురు రైతులకు ఆన్లైన్లో ముటేషన్ చేయలేదని, త్వరలో జేసీతో అప్రూవల్ తీసుకొని ఆన్లైన్ చేస్తానని తెలిపారు.
# కానాలలో రీ సర్వే ప్రకారం పొలం ఆన్లైన్ చేయడం కొద్దిగా ఆలస్యమైంది. ఏ రైతు వద్ద నుండి నయా పైసా తీస్కోలేదు. కానాల వీఆర్వో ప్రియాంక.#
కానాల గ్రామంలో పొలం రి సర్వే జరిగిన తర్వాత కొంతమంది రైతుల పొలం ఆన్లైన్ చేయడం ఆలస్యం అయిందని, కానాల వీఆర్వో ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా విఆర్వో ప్రియాంక మాట్లాడుతూ పొలం ఆన్లైన్ చేయడానికి కానాల రైతుల వద్ద నుండి ఎటువంటి నయా పైసా తీసుకోలేదని, వీఆర్వో తెలిపారు. బాధితురాలు అయిన ఫాతిమాభి భర్త పేరట ఉన్న పొలం జిల్లా అధికారులతో అప్రూవల్ తీసుకుని త్వరలో ఫాతిమాభి పేరట ఆన్లైన్ చేస్తామని వీఆర్వో తెలిపారు.

Comment List