ఉసిరికాయ మీద కార్తీక శోభ

On

GridArt_20251102_222416773
-కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రతిభ

నంద్యాల బ్యూరో. నవంబరు 02 . (పల్లె వెలుగు ):నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక సోమవారం సందర్బంగా ఓకే ఉసిరికాయ చుట్టూ మూడు ప్రధానమైన చిత్రాలను మైక్రో బ్రష్ ద్వారా అక్రాలిక్ కలర్స్ తో రెండు గంటల సమయంలో వేశారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఉసిరికి గొప్ప ప్రాధాన్యత వుంది. ఉసిరి చెట్టును సాక్షాత్తు శివుని స్వరూపమని చెబుతారు. అన్ని మాసాల కన్నా ఎంతో పవిత్ర మాసం కార్తీక మాసం.ఈ మాసంలో కార్తీక సోమవారాలకు, కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉందని భావిస్తారు. ఈ మాసంలో ఉసిరి చెట్టుకు ఉసిరి కాయలతో దీపాలు వెలిగించి భక్తితో పూజలు చేస్తారు. ఉసిరి చెట్టును పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని, నవగ్రహ దోషాలు తొలగి పోతాయని, అనారోగ్య సమస్యలు దరి చేరవని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఎంతో విశిష్టత వున్నా ఉసిరికాయ మీద సూక్ష్మ చిత్రాలు వేసాను. నేను వేసిన ఈ చిత్రంలో పరమశివుడు అర్ధనారీశ్వరుని రూపంలో చిరునవ్వుతో భక్తులకు దర్శనమిచ్చి దీవిస్తున్నట్లు, ఉసిరి చెట్టు కింద ఉసిరి కాయలతో దీపాలు వెలిగించి భక్తులు పూజిస్తునట్లు, శివలింగం, శివాలయం, ప్రకృతి దృశ్యాలు, స్త్రీలు కార్తీక దీపాలు నదిలో వదలి భక్తితో మొక్కుతున్నట్లు, భక్తులు పుణ్య నదిలో స్నానాలు చేస్తున్నట్లు ఇలా కార్తీకశోభను ఓకే చిన్న ఉసిరికాయ మీద వేసాను . భక్తులందరికి కార్తీకమాసం శుభాకాంక్షలు. అందరికి ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

12 మంది మృతి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ..  12 మంది మృతి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. 
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్ బస్సుపై కంకర పడటంతో పలువురు ప్రయాణికుల గల్లంతు మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా...
ఉసిరికాయ మీద కార్తీక శోభ
కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.!