ఉపాధ్యాయుడిగా ఎంపికైన పాణ్యం చక్రధర్ కు ఘన సన్మానం 

On

GridArt_20250918_094708503

మహానంది సెప్టెంబర్ 17 (నంది పత్రిక):-
మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామానికి చెందిన పాణ్యం చక్రధర్ డీఎస్సీ 2025 లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా ఎంపికైనందుకు మహానందీశ్వర పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు హరిబాబు,కరస్పాండెంట్ చక్రపాణి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తూ మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తపనతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించారన్నారు.ఈయనను  ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు.ఈ కార్యక్రమంలో మహానందీశ్వర పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News