ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 

On

GridArt_20251027_163448792
 
 *పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
 
 *పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, బాధ్యతలు తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోడానికి ఓపెన్ హౌస్ కార్యక్రమం దోహదపడుతుంది......* 
 
 *పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలు, సాంకేతిక ఉపకరణాలతో పాటు సైబర్ క్రైమ్,శక్తి యాప్ ల  గురించి విద్యార్థులకు వివరించిన పోలీసు అదికారులు...* 
 
 *పోలీస్ జాగిలం హాని విన్యాసాలు అద్భుతం ...* 
 
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో  జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS  పోలీసు ఆయుధాల ప్రదర్శన (OPEN HOUSE ఎగ్జిబిషన్) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  రాగానే పోలీసు జాగిలం హాని మరియు హ్యాండ్లర్ నుండి గౌరవ వందనం స్వీకరించారు.  అనంతరం పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, పరికరాలు, సాంకేతిక సాధనలను గురించి ఎస్పీ  విద్యార్థులకు వివరించారు. 
ఈ కార్యక్రమంలో ఎస్పీ  మాట్లాడుతూ పోలీసు అమరులను స్మరించుకోవడంతో పాటు సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, పరికరాలు, బాధ్యతలు, శాంతిభద్ర నిర్వహణ తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని, క్రమశిక్షణ అలవర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు అందరూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. 
 *ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలు....* 
ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాలో పోలీసులు వాడే 410 DP మస్కట్,7.62 mm బోల్ట్ యాక్షన్ రైఫెల్,7.62 MM SLR, 7.62 mm AK 47 రైఫెల్ 9 mm కార్బన్ ,9 mm పిస్టల్ V.L పిస్టల్ 16 mm PPT ,ఫెడరల్ గ్యాస్ గన్, టియర్ స్మోక్ గ్రనేడ్స్ ,టియర్ స్మోక్ షెల్ , 303 రఫీల్, 380 రివాల్వర్,ఫైబర్ లాఠీ ,హెల్మెట్ స్టోన్ గార్డ్,బాడీ ప్రొటెక్టోర్,పోలీసు వయర్ లెస్ కమ్యూనికేషన్,హాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టోర్ ,డీప్ సర్చ్ మెటల్ డిటెక్టోర్  డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టోర్ మొదలగు పరికరాలు అవి పనిచేయు విధానం గురించి పోలీసులు విద్యార్ధులకు, వివరించారు.  
అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రూపొందించిన శక్తి యాప్ వాటి ప్రయోజనాల గురించి మరియు సమాజంలో జరుగుతున్న వివిధ రకాల నేరాలు ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలపై జరిగే నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని మహిళా ఇన్స్పెక్టర్లు గౌతమి గారు జయరాం గారు వారి సిబ్బంది వివరించడం జరిగింది.
 సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో పడకుండా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో విద్యార్థులకు తెలియజేస్తూ మీరు విన్న వాటిని మీ తల్లిదండ్రులకు తెలియజేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
 *అబ్బురపరిచిన పోలీస్ జాగిలం హనీ విన్యాసాలు* 
విన్యాసాలులో భాగంగా ముందుగా జిల్లా ఎస్పీ గారికి పోలీసు జాగిలం హాని మరియు హ్యాండ్లర్ గౌరవ వందనం చేశారు అనంతరం జాగిలం పేలుడు పదార్థాలు ఉంచిన బాక్సులను గుర్తించాయి. అంతేకాక పోలీసు జాగిలాలు పేలుడు పదార్థాలు మరియు హత్యలు, దొంగతనాలు జరిగిన సందర్భాలలో నిందితులను గుర్తించడం కోసం జాగిలాలు విధులు నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుగందర్ బాబు గారు RI లు బాబు గారు, మంజునాథ్ గారు ,సురేశ్ బాబు గారు ,RSI లు  పోలీస్ సిబ్బంది విధ్యార్థిని విధ్యార్థులు పాల్గొన్నారు.
 
జిల్లా పోలీసు కార్యాలయం నంద్యాల

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.