శ్రీశైలం భారీగా మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 48 లక్షల 96 వేల 431 నగదు
131 గ్రాముల 300 మిల్లి గ్రాముల బంగారం,5 కేజీల 50 గ్రాముల వెండి లభించాయి
పల్లె వెలుగు:-నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది ఈరోజు చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు జరిగింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 46 లక్షల 96 వేల 431 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం డిప్యూటీ కార్య నిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ తెలిపారు, ఈ ఆదాయాన్ని గత 29 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ వెల్లడించారు ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 131 గ్రాముల 300 మిల్లి గ్రాములు బంగారం,అలానే వెండి 5 కేజీల 50 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు 2321 యుఎస్ఏ డాలర్లు,సింగపూర్ డాలర్లు 20, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది హుండీల లెక్కింపులో డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు....
Comment List