శ్రీశైలం లో అంగరంగ వైభవంగా తెప్పొత్సవం
On
శ్రీశైలం లో అంగరంగ వైభవంగా తెప్పొత్సవందసరా మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం (02.10.2025) శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిపించబడుతుంది.
ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలను నిర్వహించబడుతాయి. తరువాత ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి ఊరేగింపుగా తొడ్కోని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేబు చేయించి విశేషపూజాదికాలను నిర్వహించబడతాయి.తరువాత మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా ఈ తెప్పోత్సవం నిర్వహించబడుతుంది.కాగా వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలంకరణతో ఈ తెప్ప ఎంతో కళాత్మకంగా రూపొందించ బడుతుంది.
ఈ తెప్ప అలంకరణకు గానుఎర్రబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్‌రోస్, కాగడాలు, గ్లాడియేలస్, జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించడం జరుగుతోంది.
ఇంకా పలురకాల పత్రమాలలు కూడా ఈ తెప్ప అలంకరణకు వినియోగించడం జరుగుతోంది.అదేవిధంగా విద్యుత్ దీపాలతో కూడా ఈ తెప్ప అలంకరించబడుతోంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Oct 2025 10:31:15
జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక)
మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు

Comment List