మహానందిలో ముగిసిన దసరా ఉత్సవాలు
మహానంది:మహానందిలో ముగిసిన దసరా ఉత్సవాలు
-ఆకట్టుకున్న నృత్యాలు
-భక్తి శ్రద్ధలతో శమీ పూజలు
మహానంది
క్షేత్రంలో 11 రోజలు పాటు జరిగిన దసరా కామేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం పుర్ణాహుతితో ముగిసాయి. ముందుగా ఆలయంలో వేదపండితులు భక్తి శ్రద్ధ్దలతో ప్రత్యేక దసరా పూజలు నిర్వహించారు. యాగశాల మంటపంలో ఆలయ ఈవో ఎన్ శ్రీనివాస రెడ్డి చేత యాగాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం పుర్ణాహుతి జరిపారు. సాయంకాలం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మహానంది సమీపంలోని ఈశ్వర్‌నగర్ కాలనీలో జమ్మి చెట్టు వద్దకు ఉత్సవమూర్తులను మేళతాళాలతో తీసుకొచ్చి గ్రామోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్నెంట్స్ , టెంపుల్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.ఆకట్టుకొన్న దసరా వేషధారణలు*: మహానందిలో జరిగిన విజయదశమి వేడుకల్లో భాగంగా గ్రామానికి చెందిన యువకులు దసరా వేషాలు వేశారు. ఆలయం ముందు భాగంలో శక్తి, భద్రకాళి, మహిషాసురమర్దిని అలంకరణలతో నృత్యాలు నిర్వహించారు.

Comment List