ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం
-డాక్టర్. ఎ అరుణ కుమారి
ఎంబీబీఎస్ డి జి ఓ ఎఫ్ఏజీఈ
ఇన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గోల్డ్ మెడల్
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నంద్యాల
నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 19 . (నంది పత్రిక ):ఎండోక్రిన్ డిస్రప్టోరు అంటే శరీరంలోని హార్మోన్ల పనితీరును ప్రభావితం చేసే సహజమైన మానవ నిర్మిత రసాయనాలు.ఇవి హార్మోన్లను అనుకరిస్తాయి లేదా నిరోధిస్తాయి లేదా అంతరాయం కలగజేస్తాయి .ఇవి ఈస్ట్రోజన్ ఆండ్రోజన్ థైరాయిడ్ హార్మోన్లను సాధారణంగా అనుకరిస్తాయి.ప్లాస్టిక్స్ సౌందర్య సాధనాలు పురుగుమందులు వంటి అనేక రోజు వారి ఉత్పత్తుల్లో ఇవి కనిపిస్తాయి. గాలి ఆహారం నీరు చర్మం ద్వారా ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి
దీనివలన అభివృద్ధి వైకల్యాలు పునరుత్పత్తి సమస్యలు అకాల యుక్తవయసు సంతానలేమి సమస్యలు మరియు క్యాన్సర్ సంక్రమించవచ్చు . రోగనిరోధక నాడీ వ్యవస్థల మీద ఈ ఎండోక్రయం డిస్టర్ప్టర్స్ పనిచేస్తాయి . దీనివలన ఊబకాయం హృదయం మనము రోజు వాడే ప్లాస్టిక్ కంటైనర్లు సౌందర్య సాధనాలు షాంపూ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎండక్రైన్ డిస్టప్టర్స్ ని కలిగి ఉంటాయి పిల్లలు ఆడుకునే బొమ్మలు వారు వేసుకునే బట్టలు, పెద్దవాళ్లు వాడేటటువంటి సింథటిక్ బట్టలు అంటే స్పోర్ట్స్ బ్రా లెగ్గింగ్స్ యోగ ప్యాంట్లు వ్యాయామ దుస్తులను ప్లాస్టిక్ కంటెంట్ ఉంటుందని
డాక్టర్. ఎ అరుణ కుమారి అన్నారు.మరి వీటిని పరిమితం చేయడం ఎలా?ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం తగ్గించాలి. బాటిల్ మీరు బదులుగా ఫిల్టర్ నీరు వాడాలి. ప్లాస్టిక్ కంటైనర్లలో మైక్రోవేవ్ చేయకూడదు . వేడి ప్రదేశాల్లో డబ్బాల్లో లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని నిల్వ చేయకూడదు ఎయిర్ ఫ్రెషనర్లు లేదా దుర్గంధ నాసిని వినియోగం తగ్గించాలి. సింథటిక్ ఫ్యాబ్రిక్ వినియోగం తగ్గించాలి లేదా ప్లాస్టిక్ లేని సహజమైన ఫ్యాబ్రిక్ ని ఎంచుకోవాలి .పాల ఉత్పత్తులను తగ్గించాలి గర్భిణీలు పాలిచ్చే తల్లులు చేపల్ని మితంగా తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ తినకూడదు. సేంద్రీయ పండ్లు, సేంద్రియ కూరగాయలు, సేంద్రియ మాంసం ,సేంద్రియ ఆహారం వినియోగం పెంచుకోవాలి.

Comment List