ట్రాన్స్ఫార్మర్ కోసం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన లైన్ మెన్ ! 

On

IMG-20251014-WA0011

నాగర్ కర్నూల్ ప్రతినిధి అక్టోబర్ 14, పల్లె వెలుగు దినపత్రిక: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. జిల్లాలోని వంగూరు మండలం మాచినోనిపల్లి టీజీఎస్పీడిసిఎల్ కు  చెందిన లైన్ మెన్ తోట నాగేంద్ర మంగళవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడుకి చిక్కాడు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రైతులు లైన్ మెన్ ను సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు మహబూబ్నగర్ పరిధిలోని ఏసీబీని ఆశ్రయించగా మంగళవారం అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడ్డ లైన్ మెన్ పై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని అధికారులు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అవినీతికి పాల్పడే వారి సమాచారాన్ని ఏసీబీ టోల్ ఫ్రీ 1064 నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు. వాట్సాప్ నెంబర్ 9440446106 కు తెలంగాణ ఏసీబీ, ఫేస్ బుక్ ట్విట్టర్ ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News