నంద్యాల హెచ్ఎమ్ జ్యూవెలర్స్ షాపులో వెండి పట్టీలు దొంగతనం చేసిన ఇద్దరు మహిళలు అరెస్ట్

On

నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి

హెచ్ఎమ్ జ్యూవెలర్స్ షాపులో వెండి పట్టీలు దొంగతనం చేసిన ఇద్దరు మహిళలు అరెస్ట్

నంద్యాల ప్రతినిధి. నంది పత్రిక. ఫిబ్రవరి 18 :నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు నంద్యాల ఎస్డిపిఓ మందా జావళి ఆల్ఫోన్స్గారి పర్యవేక్షణలో, నంద్యాల జిల్లా, నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సిబ్బంది కలిసి, బంగారు షాపులలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఆడవాళ్ళను అరెస్టు చేసి, వారి నుండి సుమారు 17 తులాల వెండి పట్టీలను స్వాధీనము చేసుకునట్లు నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 12.02.2026 వ తేదీ మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో, బంగారు అంగళ్ళ వీధిలో ఉన్న హెచ్ఎమ్ జ్యూవెల్లర్స్ షాపులోకి ఇద్దరు ఆడవాళ్ళు వెండి పట్టీలు కొనుగోలు చేయడానికి వచ్చినట్లు నటించి, షాపులో సుమారు 17 తులాలు గల వెండి పట్టీలను దొంగిలించినారని, ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు సమయంలో లభించిన సిసి పుటేజ్ ఆధారంగా బుధవారం ఉదయం 11.30 గంటలకు, నంద్యాల టౌన్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఔట్ గేట్ సమీపములో మదనపల్లికు చెందిన వేముల జ్యోతి, వేముల నరసమ్మలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి దొంగిలించబడిన సుమారు 17 తులాలు గల వెండి పట్టీలను స్వాధీనం చేసుకునట్లు నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.వారి ఇద్దరి నుండి స్వాధీనం చేసుకున్న వెండి వస్తువులు;1. సుమారు 17 తులాలు గల రెండు జతల వెండి పట్టీలువీరిపై గతంలో
నెల్లూరు, మరియు తిరుపతి ప్రాంతాలలో కూడా కేసులు వున్నాయి.ఈ కేసు నమోదు అయిన వారం రోజుల్లో ఛేదించిన నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డిని వారి సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలి.షాప్ లు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లలో మంచి రిజల్యూషన్ కల సీసీ కెమరాలు పెట్టుకోవాలి.అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాల న్నారు.

3f48a646-8cda-4056-9a94-af3e4a3b3b5f

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం