నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

On

నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం IMG-20260312-WA0015

మహానంది. మార్చి 12 .  (నంది పత్రిక ):నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,డాక్టర్ అరుణ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహానంది మండలం బుక్కాపురం గ్రామం సచివాలయం వద్ద చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు  డాక్టర్ వినోద్ కుమార్, స్త్రీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య నిపుణులు డాక్టర్ అరుణకుమారి, ఎముకలు కీళ్ల వ్యాధిని నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్ , గైనకాలజిస్ట్ డాక్టర్ ఫాతిమాభి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ పద్మ ప్రియాంక  తదితరులు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 300 మంది కి పైగ వైద్య సేవ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం