మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు.

On

మురుగు జలపాతం చూడండి.
..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.
... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు.IMG-20260709-WA0009
..శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా.
...రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.
నంద్యాల జులై 9 ( నంది పత్రిక )
      నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ కు వెళ్ళే అడ్డదారిలో మురుగు నీరు జలపాతంలా కనిపిస్తుంది.ఆ ప్రాంతంలో కాల్వల నిర్మాణం సరిగా లేకపోవడం,శానిటేషన్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో రోడ్డు పై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు,విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో కాల్వ నిర్మాణాలు లేకపోవడంతో మురుగునీరు వల్ల సి.సి.రోడ్డు కింద మట్టి లేకపోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి.ఆ ప్రాంతంలో కాల్వల నిర్మాణం చేపట్టాలని అప్పటి కౌన్సిలర్ పలుమార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చినా పలితం లేదు.ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటుచేసిన అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పట్టించుకోకపోవడం విశేషం.శానిటేషన్ సిబ్బంది,మేస్త్రి,సచివాలయ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.ఆ ప్రాంతంలో ఐటీఐ,ఒక ప్రవేటు పాఠశాల కు వెళ్ళే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.దగ్గరి రహదారి కావడంతో ప్రజలు ఇటువైపు వెళుతూ మురుగు నీరు ఉన్న వాహనాలతో అలాగే వెళుతున్నారు.మురుగునీరు ఇలా ఉంటే రోగాలు రావా.పట్టణంలో వర్షాకాలం ప్రధాన రహదారుల్లో పూడికలు తీస్తారు.సమస్యలు ఉన్న ప్రాంతంలో  మాత్రం పట్టించుకోకపోవడం విశేషం.శానిటేషన్ లో అధికారులు,సిబ్బంది ఉన్నారా లేదా అని ప్రజలు చర్చించుకోవడం విశేషం.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు. మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు.
మురుగు జలపాతం చూడండి...స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు...శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా....రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.నంద్యాల జులై 9 ( నంది...
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా