నంద్యాల జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్

On

17 సంవత్సరాల లోపు బాల బాలికల చదరంగం పోటీలు
ప్రారంభించిన డాక్టర్  రవి కృష్ణ

6714675c-a6de-40a7-84de-3f75ae8b1d94ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి 17 సంవత్సరాల లోపు బాల బాలికల ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది.నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఎన్ ఆర్ జి చెస్ అకాడమీ అధ్యక్షులు కామినేని పల్లె సర్పంచ్ మేరువ చిన్న నరసింహారెడ్డి చదరంగం బోర్డ్ పై పావులు కదిలించి లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ  మేధాశక్తిని పదును పెడుతుందన్నారు. విద్యార్థులలో ఏకాగ్రతను ఇనుమడింప చేస్తుందన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సాయి పోటీలలో నంద్యాల జిల్లా  తరపున పాల్గొంటారని అన్నారు.మేరువ చిన్న నరసింహారెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారాగెలుపు ఓటములను స్వీకరించే ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. గెలిచినవారు మళ్లీ గెలవాలని ఓటమి చెందిన వారు నిరంతర సాధన ద్వారా భవిష్యత్తులో గెలుపు సాధించడానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా  చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ప్రముఖ సర్జన్ డాక్టర్ నీలా ప్రసాద్న రసింహారెడ్డి, నాగేశ్వరరెడ్డి క్రీడాకారులు వారి శిక్షకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.227b0679-4a34-4e5b-8623-31e9858cd029

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం