మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం

-ఇమాములు, మౌజన్ లకు 24 గంటల వ్యవధిలో అకౌంట్లకు గౌరవ వేతనం జమ
-చంద్రబాబు మైనారిటీ ల పక్షపాతి
-హామీలను నెరవేర్చడమే లక్ష్యం
-రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి, మార్చి 17. నంది పత్రిక: రాష్ట్రంలోని మైనారిటీల అభివృద్ధికి,సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యాచరణ బద్దంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.మైనారిటీలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ముందుకెళుతున్నదని మంగళవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రంజాన్ పర్వదినానికి రెండు రోజులు ముందే రాష్ట్రంలోని ఇమాములు, మౌజన్ లకు ఒకేసారి 6 నెలల గౌరవ వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం రూ. 45 కోట్లు విడుదల చేయడమే కాకుండా, కేవలం 24 గంటల లోపలే ఆ మొత్తాన్ని వారి అకౌంట్లకు జమ చేయడం జరిగిందని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ ఏ- కన్వెన్షన్ సెంటర్ లో 16వ తేది సాయంత్రం జరిగిన రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇమాములు,మౌజన్ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిధుల విడుదల చేస్తూ అదే రోజు రాత్రే మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ జీవో జారీ చేశారని మంత్రి వెల్లడించారు. ఒకేసారి గత ఆరు నెలల బకాయిలను రంజాన్ సందర్భంగా ఒకేసారి కూటమి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌ల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ ప్రక్రియ ను 24 గంటల పూర్తి చేయడం కూడా జరిగిందని కూడా మంత్రి తెలిపారు.ఇందులో భాగంగా 5,000 మంది ఇమామ్‌లకు ఆరు నెలల వేతనం కింద రూ.30 కోట్ల చెల్లింపులు,5,000 మంది మౌజన్లకు ఆరు నెలల వేతనం కింద రూ.15 కోట్లు మొత్తాన్ని వారి అకౌంట్లకు జమ చేయడం జరిగిందన్నారు. మైనారిటీల పక్షపాతిగా సీఎం చంద్రబాబు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం 24 గంటలు కృషి చేస్తున్నారని అన్నారు. రంజాన్ పర్వదినానికి రెండు రోజుల ముందే ఇమాములు, మౌజన్ లకు రూ. 45 కోట్లు మొత్తాన్ని గౌరవ వేతనం చెల్లింపు పట్ల రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల తరఫున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.మైనారిటీల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, మైనారిటీల పక్షపాత ప్రభుత్వంగా వారి సంక్షేమానికి ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు.

Comment List