శక్తి టీం బృందాలచే అవగాహన కార్యాక్రమం ఏర్పాటు..

On

7e25d7f4-c806-4234-9e8e-77530af07754

నంద్యాల క్రైం, మార్చి05(నంది పత్రిక):-

నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్నీ స్కూల్లలో  కాలేజీలలో మహిళలపై నేరాలు , బాల్య వివాహాల నిరోధం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ పై నియంత్రణ,  సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్  ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్ పి ఎం.జావళి  సూచనలతో నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది జిల్లా పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల చిన్మయ   మిషన్ విద్యాలయ హై స్కూల్ నందు విద్యార్థినిలకు శక్తి యాప్ గురించి వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా వివరించడంతోపాటు  మీ తల్లిదండ్రులకు  శక్తి యాప్ గురించి తెలియజేసి వారి సెల్ ఫోన్ లలో రిజిస్టేషన్ చేసుకునేలా చూడాలన్నారు.అనంతరం ప్రస్తుతం సమాజంలో జరిగే  సైబర్ క్రైమ్ నేరాల గురించి వివరించి ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే  1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చునని అవగాహన కల్పించారు.బాల్య వివాహాలు, మహిళలు,చిన్నపిల్లలపై జరిగే నేరాలగురించి అవగాహన కల్పించి వాటికి సంబందించిన టోల్ ఫ్రీ నెంబర్ 1098 గురించి వివరించారు. ఆపద సమయంలో అమ్మాయిలు శక్తి యాప్ నంబర్ 7993485111 కు ఫోన్ చేసినచో తక్షణమే స్పందిస్తామని శక్తి టీం బృందాలు తెలిపారు.నంద్యాల జిల్లాలో గల వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి శక్తి టీముల పనితీరును వివరించడంతో పాటు అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన 112/100 గురించి తెలిపారు. మీరు బాధ్యతగల పౌరులుగా ఎదగాలని, విద్యతో పాటు మంచి నైతిక విలువలను అలవర్చుకోవాలన్నారు.బాలికలు అన్ని రంగాల్లో రాణించగల సామర్థ్యం కలవారని, ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధ్యాపకులకు తెలిపారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు. మురుగు జలపాతం చూడండి. ..స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో. ... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు.
మురుగు జలపాతం చూడండి...స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్ళే రహదారిలో.... ఐటీఐ,పాఠశాల,ప్రజల ఇబ్బందులు...శానిటేషన్ మేస్త్రి,సిబ్బంది పట్టించుకోరా....రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగు.నంద్యాల జులై 9 ( నంది...
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా