ఆరెండ్ల అంగ వైకల్యం అమ్మాయికి జ్ఞాన నిధి సేవా సంస్థ ఆర్థిక సహాయం

On

ఆరెండ్ల అంగ వైకల్యం అమ్మాయికి జ్ఞాన నిధి సేవా సంస్థ ఆర్థిక సహాయం
బేతంచెర్ల ఫిబ్రవరి 9 ( నంది పత్రిక)
బేతంచెర్ల పట్టణంలో బేగరిపేట కాలనీకి చెందిన ఆ చిన్నారికి ప్రస్తుతం ఆరేళ్లు.అమ్మా అనలేదు.అమ్మ నాన్న లేరు..తల్లి చిన్నప్పుడే  మరణించిది. తండ్రి ఊరొదిలి వెళ్లిపోయారు. నోటమాటరాని ఆ చిన్నారి ఆలనాపాలనా అమ్మమ్మ,తాతలైన మల్లేశ్వరి,వెంక టేశ్వర్లు చూస్తున్నారు. వీరు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నారి మెదడు ఎదుగుదల లేదు.కాళ్లూ చేతులు వంకర్లు పోయి ఎదుగుదల లేక,మంచానికే పరి మితమైంది. ఆకలైనా, బాధ కలిగినా నోరు తెరిచి చెప్పలేని పరిస్థితి.ఇలాంటి పరిస్థితుల్లో కూలీ నాలీ చేసుకునే ఆ వృద్ధులకు చిన్నారి వైద్య ఖర్చులు భరించడం భారంగా మారింది.ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడపాల్సిన ఆ చిన్నారి కదల్లేని స్థితిలో ఆరేళ్ల రిషిక మంచానికే పరిమిత మైంది.52ee3327-06e6-4a03-8c66-7b785cbe2bdcఅమ్మమ్మ, తాతలే సపర్యలు చేస్తున్నారు.చిన్నారి వైద్యం కోసం వృద్ధులు ఇప్పటికే రూ.3 లక్షల వరకు అప్పులు చేశారు.. ప్రస్తుతం పూటగడవడం కష్టంగా మారింది. చిన్నారికి సదరం(దివ్యాంగుల) పత్రం ఉన్నా,పింఛన్ ఇవ్వడం లేదు. కనీసం పింఛ నైనా అందిస్తే చిన్నారి నెలవారి ఔషధాలకు అక్కర కొస్తాయని, ఆ వృద్ధులు విన్నవిస్తున్నారు.వీరు మన జ్ఞాన నిధి  సేవా సంస్థను సంప్రదించి సహాయం కోరారు. జ్ఞాన నిధి సేవా సంస్థ సభ్యులు ఆ పాపకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అంద జేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జ్ఞాన నిధి సేవా సంస్థ సభ్యులు జె.తిమ్మయ్య (టీచర్),ఆనంద్, పుల్లయ్య, ప్రసాద్, శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

ఆరెండ్ల అంగ వైకల్యం అమ్మాయికి జ్ఞాన నిధి సేవా సంస్థ ఆర్థిక సహాయం ఆరెండ్ల అంగ వైకల్యం అమ్మాయికి జ్ఞాన నిధి సేవా సంస్థ ఆర్థిక సహాయం
ఆరెండ్ల అంగ వైకల్యం అమ్మాయికి జ్ఞాన నిధి సేవా సంస్థ ఆర్థిక సహాయంబేతంచెర్ల ఫిబ్రవరి 9 ( నంది పత్రిక)బేతంచెర్ల పట్టణంలో బేగరిపేట కాలనీకి చెందిన ఆ...
నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు 
తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం కలిగిస్తాయి
ఫిబ్రవరి 8 వ తేదీ న నంద్యాల జిల్లా స్థాయి చెస్ పోటీలు -19 సంవత్సరంలోపు బాల   బాలికలకు   ప్రత్యేక విభాగాలలో -రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక
రాయలసీమ ద్రోహి జగన్.. అభివృద్ధి చేసింది ఒక్క టీడీపీనే : మంత్రుల ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి
విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ 
రైతులు మోసపోయి తక్కువ ధరకు కందులను ఇవ్వొద్ధు.