నంద్యాల యాదవుల కార్తీక వనభోజనాలను విజయవంతం చేయండి

నంద్యాల ప్రతినిధి. నవంబరు 12 . (నంది పత్రిక ):నంద్యాల పద్మావతి నగర్
శ్రీకృష్ణ మందిరం నందు ఈనెల 16.11.25 అనగా ఆదివారం యాదవుల కార్తీక వనబోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ నిర్వాహకులు బుధవారం కోరారు. యాదవ కార్తీక వనభోజన కమిటీ ఆధ్వర్యంలో యాదవ కార్తీక వనభోజన కార్యక్రమం నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత యాదవ బంధుమిత్రులు భక్తిశ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఉదయం 10 గంటలకు ఉసిరి చెట్టుకు పూజ
కోటి దీపోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పిల్లలకు మహిళలకు పురుషులకు ఆటల పోటీలు,యాదవుల ఆత్మీయ పలకరింపులు. భోజనాలు అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు.వందన సమర్పణ కార్యక్రమం ముగింపు. అన్ని కార్యక్రమాలను వీక్షించి భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరారు.అదేవిధంగా మన నంద్యాలలో ఉన్న యాదవ్ పెద్దలు పార్టీలకతీతంగా మాకు సహాయ సహకారాలు అందించారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో యాదవ సంక్షేమం కోసం వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వేదిక మన శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్ నంద్యాల.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పృధ్వీరాజ్ యాదవ్, విజయ గౌరీ యాదవ్, భోధనం చంద్రశేఖర్ యాదవ్ మెట్ల శ్రీనివాసరావు యాదవ్ డీవీ సుబ్బయ్య యాదవ్ పేరయ్య యాదవ్ మహేష్ యాదవ్ మధు యాదవ్ నందకుమార్ పాల్గొన్నారు.

Comment List