నాణ్యమైన జర్నలిజంతోనే మెరుగైన సమాజం

On

- జర్నలిజం చాలా గొప్పది 

- కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు 

- ముగిసిన జర్నలిస్టుల శిక్షణ తరగతులు 

GridArt_20250914_192424047

 కర్నూలు. సెప్టెంబర్ 14 . (నంది పత్రిక ): నాణ్యమైన జర్నలిజంతోనే మెరుగైన సమాజం సాధ్యమౌతుందని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని మౌర్య ఇన్ హోటల్ లోని పరిణయ ఫంక్షన్ హాలులో సీఆర్ మీడియా సహకారంతో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన జర్నలిస్టుల శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కర్నూలు ఎంపీ జర్నలిస్టులనుద్దేశించి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు రక్షణ లేదని, విమర్శనాత్మక వార్తలు రాసేందుకు భయపడేవారన్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఏ పాటి రక్షణ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జర్నలిజం చాలా గొప్పదని, ప్రతిరోజు జర్నలిస్టులతోనే నా జర్నీ ఉంటుందని గుర్తు చేశారు. భవిష్యత్ లో శాంకేతికతను ఊయోగించుకుని పారదర్శకంగా వార్తలు రాయాలని ఆకాంక్షించారు. 

 

రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు 

- ఆలపాటి సురేష్ కుమార్, ఏపీ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ 

 

జర్నలిస్టులకు జర్నలిజంలో వృత్తి నైపుణ్యంలో మెళకువలు నేర్పేందుకు ఏపీ మీడియా కృషి చేస్తుందని మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఇప్పటి వరకు తెనాలి, మార్కాపురం, కర్నూలు ప్రాంతాల్లో ఈ శిక్షణ తరగతులు దిగ్విజయంగా జరిగాయన్నారు. జాతియోధ్యమ కాలం నాటి జర్నలిజానికి, ప్రస్తుత జర్నలిజానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కథనాలు రాసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. 

 

మార్పుతో కూడిన జర్నలిజం అవసరం 

- కర్నూలు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా 

 

ప్రస్తుత సమాజంలో మార్పుతో కూడిన జర్నలిజం అవసరమని కర్నూలు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా అన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా జర్నలిస్టులు వార్తలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. 

 

ప్రతి జర్నలిస్టు పుస్తకాలతో స్నేహం చేయాలి 

- ఐజేయూ జాతీయ ప్రధాన సెక్రటరీ సోమసుందర్ 

 

ప్రతి జర్నలిస్టు పుస్తకాలతో స్నేహం చేసినప్పుడే జ్ఞానాన్ని పెంపొందించు కోవచ్చని ఐజేయూ జనరల్ సెక్రటరీ సోమసుందర్ అన్నారు. గ్రామీణ వార్తలు-కథనాలు అంశం గురించి జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. మనకంటూ ప్రత్యేక శైలి ఉంటేనే సమాజంలో మనకు గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి జర్నలిస్టు నిత్యం సమాజాన్ని అధ్యయనం చేసినప్పుడే మరింత నైపుణ్యాన్ని కలిగి ఉంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందుతు న్నాయా ?, లేదా ? అనే కోణంలో కథనాలు రాసినప్పుడే మన వృత్తికి న్యాయం చేసిన వరమౌతామని చెప్పారు. ఆ దిశగా ప్రతి జర్నలిస్టు తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాది ఏపీ, తెలంగాణలో మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించాలని, అలాగే సెమినార్లు, ప్రసంగాలు.. ఇలా పలు అంశాలపై మేఫీ శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. 

 

పాఠకుడిని చదివించేలా వార్తలు రాయాలి 

- ఐవీ. సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు 

 

సోషల్ మీడియా విస్తరించిన నేపథ్యంలో పాఠకుడిని చదివించేలా రాజకీయ, నేర వార్తలు రాయాలని ఏపయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ. సుబ్బారావు అన్నారు. ఒక నేర ఘటన జరిగిన తీరును అందరు రాస్తారు. కానీ ఘటనకు గల కారణాలను మానవీయ కోణంలో రాస్తేనే పాఠకులు చదివేందుకు ఆసక్తి చూపుతారు. మనం కక్ష పూరిత వార్తలు రాయడం వృత్తి ధర్మం కాదన్నారు. లీగల్ వార్తలను చాలా జాగ్రత్తగా రాయాలని సూచించారు. పత్రికలకు చెడ్డపేరు తెచ్చే వార్తలను దూరంగా ఉంచాలి. భవిష్యత్ లో జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని భరోసా కల్పించారు. అర్హులందరికీ అక్రిడిటేషన్లు అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అందుకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహాలకు సంబంధించిన అంశాల గురించి ముఖ్యమంత్రికి తెలియజేస్తామని తెలిపారు.

 

జర్నలిజంలో మార్పుతోనే మనుగడ 

- ఉమా మహేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్ 

 

మార్పుతో కూడిన జర్నలిజంతోనే జర్నలిస్టులకు మనుగడ ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ ఉమా మహేశ్వర రావు అన్నారు. కోవిడ్ తర్వాత జర్నలిజం తన పరిణామ క్రమాన్ని మార్చుకుంద న్నారు. వాటి మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు మారాలన్నారు. సమాజంలో జరిగే ఆసక్తి గల వార్తలను ఫీచర్ గా రాస్తే పాఠకులు బాగా ఆదరిస్తారన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలు ఫీచర్లకు ఖజానాలు అని కొనియాడారు. ప్రస్తుత సోషల్ మీడియా వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలన్నారు. ప్రతి జర్నలిస్ట్ మార్పు చెందకుంటే మనుగడ లేదన్నారు. సాంస్కృతికపరమైన అంశాలు, ఉత్సవాలు, కళాకారుల జీవిత చరిత్రలు, జానపదం, పండుగల నేపథ్యాలు, గ్రామీణ ప్రాంత ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు.. ఇలా చాలా వాటి గురించి ఫీచర్ కథనాలు రాయొచ్చన్నారు. అలాగే ప్రజల అలవాట్లకు అనుగుణంగా వార్తలు రాసేలా మార్పు చెందాలన్నారు. అంతిమంగా గ్రామీణ జర్నలిస్టులు ఎలాంటి వార్తలను ఫీచర్లుగా మలుచు కోవచ్చో అవగాహన కల్పించారు.

 

ప్రాణాలకు తెగించి చేసే జాబ్.. జర్నలిజం 

- సీనియర్ జర్నలిస్ట్ శంకర్ నారాయణ 

 

సమాజంలో ప్రాణాలకు తెగించి చేసే జాబ్ ఒక్క జర్నలిజమేనని సీనియర్ జర్నలిస్ట్ శంకర్ నారాయణ అన్నారు. ప్రస్తుత సమాజంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి ప్రాసలతో వివరించి అందరిని హాస్య లోకంలోకి తీసుకెళ్లారు. గతంలో ఏమోగానే ప్రస్తుతం జర్నలిస్టులు డబ్బులు తీసుకుంటున్నారని అంటున్నారు గానీ నిజానికి జర్నలిస్టులు దెబ్బలు తింటున్నారన్నారు. అలాగే సుత్తి మన జీవితంలో వృత్తి అయిందని, వార్తలు సాగు చేయాలి గానీ సాగదీయొద్దని, డెస్క్ తో బాగుండాలని, రిస్క్ తో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రాసలతో అలరించారు.

అలరించిన శంకర్ మిమిక్రి 

సీఆర్ అకాడమీ సహకారంతో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన జర్నలిస్టుల శిక్షణ తరగతుల్లో జర్నలిస్ట్ శంకర్ ప్రదర్శించిన మిమిక్రి, పాటలు, మ్యాజిక్ షో పలువురిని ఆకట్టుకున్నాయి.

 

అంతకుముందు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వక్తలు, ఎంపీ బస్తపాటి నాగరాజుకు, జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఐ అండ్ పఆర్ డీడీ జయమ్మ లకు శాలువాలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లు మెటీరియల్ ఆందజేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండప్ప కర్నూలు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ. నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు వెంకట సుబ్బయ్య, నాగరాజు, గౌరవ సలహాదారు వైవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News