ఆలూరులో తెలుగుదేశం జెండా ఎగురవేయడమే ధ్యేయం.. వైకుంఠం జ్యోతి.
వైకుంఠం జ్యోతి

ఆలూరు..
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే ధ్యేయమని ఆలూరు టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి,శివ ప్రసాద్ లు అన్నారు. గురువారం మొలగవల్లి గ్రామానికి చెందిన ఎంపిటిసి బంగారు పటేల్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా టీడీపి నాయకులు, కార్యకర్తలు వచ్చి వైకుంఠం దంపతులు కు శాలువా కప్పి పూలమాలతో సన్మానం చేశారు.భారీ గజమాలతో సత్కరించారు.
గ్రామంలో ఏ సమస్య వచ్చినా టీడీపి నాయకులు,పెద్దలు అందరూ కలిసి పరిస్కారం చేసుకోవాలని అన్నారు.అనంతరం బంగారు పటేల్ యాదవ్ మాట్లాడుతూ వైకుంఠం జ్యోతి వెంట ఉండి గ్రామంలో, మండలంలో పార్టీ అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తామని అన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడిగుడ్ల రామకృష్ణ,మాణిక్య,డాక్టర్ బజారి,మాణిక్య రెడ్డి,గోపాల్,నరసింహులు,వార్డు మెంబర్లు ఐకాంత్, జలందర్,మాజీ మెంబర్ లు మురళి,చంద్ర,శేకు, ఉసేన్,హాజీ,నరసప్ప,లింగన్న లు పాల్గొన్నారు.

Comment List