భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న నరేంద్ర మోదీ 🕉️🚩


కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు గురువారం ఉదయం చేరుకున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్ పోర్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ , ఎస్పీ తదితరులు.
కర్నూలుకు చేరుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
.ప్రధాని మోదీ స్వాగతానికి సిద్ధమైన రాష్ట్ర నాయకత్వం – ఓర్వకల్లు
.విమానాశ్రయంలో ఆతిథ్య వాతావరణం
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్ గురువారం కర్నూలుకు చేరుకున్నారు. వారితోపాటు రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉన్నారు.
ఓర్వకల్లు విమానాశ్రయంలో ముగ్గురు నేతలకు జిల్లా మంత్రి, అధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆతిథ్య వాతావరణం నెలకొంది. కాసేపట్లో ప్రధాని మోదీ అక్కడికి చేరుకోనుండగా, ఆయనకు స్వాగతం పలకనున్నారు.
తరువాత ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో నుండిపెంటకు ప్రయాణం చేయనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వైపు వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలులో జరగనున్న ‘జీఎస్టీ 2.0’ సభలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.



Comment List