సమ్మెకు ఏపీయూడబ్ల్యూజే మద్దతు.

On

5e8b15b1-ecf4-4f84-bd63-2ab8bb431f4bసమ్మెకు ఏపీయూడబ్ల్యూజే మద్దతు... 
నంది పత్రిక: కర్నూలు: 
కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేస్తూ.. కొత్తగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే)మద్దతు పలికింది. గురువారం జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొనడంతో పాటు కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో కూడా నేతలు పాల్గొనడం జరిగింది. కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ల వల్ల జర్నలిస్ట ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా మాజీతీయా వేజ్ బోర్డు అమలు అటకెక్కే ప్రమాదం ఉందన్నారు. అలాగే ఉద్యోగ భద్రత గాల్లో దీపంగా మరే అవకాశం ఉందన్నారు. అలాగే జర్నలిస్టు యూనియన్ స్వరం కూడా మూగబోయే ప్రమాదం ఉందన్నారు. మొత్తం మీద జర్నలిస్టుల హక్కులు కాలరాసే విధంగా నాలుగు కోడ్లు ఉన్నాయన్నారు. కనుక కేంద్ర వెంటనే స్పందించి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ కొండప్ప, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కే నాగరాజు, జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్.రాజు, ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెకు మద్దతు పలికిన వారిలో యూనియన్ నాయకులు శివ, హరి కృష్ణ తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో  పూజాదికాలు శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు
శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో  పూజాదికాలు    నంది పత్రిక:   శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా...
మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం
జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు
10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం.
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 
శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన