ప్రమాదకరంగా నిండుగా ప్రవహిస్తున్న నీలాపురం వంక
నీలాపురం తండాకు ఆగిపోయిన రాకపోకలు
వంక మీద కల్వర్టు నిర్మాణం కొరకు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నీలాపురం గ్రామ రైతులు మరియు తాండవాసులు
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చొరవ తీసుకొని వెంటనే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని కోరుతున్న నీలాపురం గ్రామ ప్రజలు మరియు తండావాసులు
దువ్వూరు సెప్టెంబర్ 11 పల్లె వెలుగు ప్రతినిధి
దువ్వూరు మండల పరిధిలోని నీలాపురం గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షానికి వంక నిండుగా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. తాండవాసులకు నీలాపురం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నీలాపురం గ్రామ రైతులు పొలాలకు వెళ్లాలంటే ఆ వంక దాటుకునే వెళ్లాల్సి ఉంది. కానీ వర్షం వచ్చినప్పుడల్లా వంక నిండుగా ప్రవహిస్తుండడంతో అటు నీలాపురం గ్రామ రైతులు మరియు తండావాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంక మీద కల్వర్టు నిర్మాణం మరియు నీలాపురం గ్రామం నుంచి తండా వరకు రోడ్డు నిర్మాణం కొరకు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నీలాపురం గ్రామ రైతులు మరియు తండావాసులు.ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకు వెళ్లినా కూడా పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించి వెంటనే కల్వర్టు నిర్మాణం మరియు రోడ్డు నిర్మాణం చేపిస్తే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని నీలాపురం గ్రామ రైతులు మరియు తండావాసులు పేర్కొన్నారు.
Comment List