స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

On

jyothi

హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా జ్యోతిక ఈ వ్యాఖ్య‌లు చేసింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లలో తన ఫోటోను ఉంచారని, కానీ దక్షిణాదిలో మాత్రం హీరోయిన్‌ల ఫోటోలను పోస్టర్లపై పెట్టడానికి ఆసక్తి చూపరని జ్యోతిక‌ అన్నారు.తాను నటించిన ‘శైతాన్’ హిందీ సినిమా పోస్టర్‌ను అజయ్ దేవగన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, అలాగే మలయాళంలో మమ్ముట్టితో నటించిన ‘కాథల్-ది కోర్’ సినిమా పోస్టర్‌ను కూడా మమ్ముట్టి తన సోషల్ మీడియాలో పంచుకున్నారని జ్యోతిక గుర్తు చేశారు. కానీ దక్షిణాదిలో ఎంతోమంది స్టార్ హీరోలతో తాను పనిచేశానని కానీ ఏ ఒక్కరూ కూడా తమ సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలను పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం జ్యోతిక చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రోవైపు జ్యోతిక చేసిన‌ వ్యాఖ్యలు దక్షిణాదిలో హీరోయిన్‌లకు లభించే ప్రాధాన్యతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.