పులివెందల అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అవినీతిపై విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలి
ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.న్. రాజా డిమాండ్
కడప ఇన్చార్జి సెప్టెంబర్ 11
కడప కలెక్టర్ భవనంలోని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అంజల గారికి శ్రీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎన్ రాజా,
ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ ( పి ఎస్ ఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు కె,నాగరాజు లు
వారు మాట్లాడుతూ
కడప జిల్లా పులివెందుల డివిజన్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ జ్యోతి అవినీతిపై విచారణ జరిపించాలని వినతి పత్రం అందజేశారు రాష్ట్ర లో ఎక్కడ కూడా లేని విధంగా కడప జిల్లా పులివెందుల డివిజన్ పరిధిలో రూల్స్ కు విరుద్ధంగా తలకాయ మీద నాకు మీరు 30 రూపాయలు చెల్లిస్తేనే మీకు నేను బిల్స్ పెడతాను అనే విధంగా వ్యవహరిస్తూ డిపార్ట్మెంట్ కు సంబంధంలేని తన భర్తను ప్రతిపనికి ఇన్వాల్వ్ చేస్తూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆమె నిర్వహించాల్సిన పనిని తన భర్త తో బీసీ హాస్టల్ ను విసిట్ చేపించి తనకు అనుకూలమైన వర్గంతో బెరసారాలకు తెర లేపిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకొని అదే విధంగా చక్రాయిపేట మరియు వీరపునాయుని పల్లె హాస్టల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తన సొంత వ్యాపారం చేసుకుంటూ ఉంటే పలు తపాలుగా ఆమెకు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా అతనిపై యాక్షన్ తీసుకోకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా అతనికి సహకరించి ఈరోజు డిపార్ట్మెంట్ వారు అతని ఒక్కరినీ మాత్రమే సస్పెండ్ చేయడం జరిగినది కానీ అతనికి సహకరించిన అసిస్టెంట్ వెల్ఫేర్ జ్యోతి ని ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు అని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో తను నిర్వర్తించాల్సిన పనిని అమలుపరచకుండా తాను పాడిందే పాటగా వ్యవహరించి ఏక నిర్ణయ పాటుతో విద్యార్థి ల సమస్యలపై మాట్లాడకుండా ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించిన జ్యోతి గారిపై వెంటనే బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి చొరవ తీసుకొని సమగ్ర విచారణ జరిపించాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం లేనిపక్షంలో బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని వారు తెలిపారు. గతంలో కడప డివిజన్ ఇన్చార్జి అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ గా ఉన్న సందర్భంలో కూడా ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి వాటిపై కూడా అనేక రకాలుగా మేము కంప్లీట్ ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క కంప్లీట్ కూడా తన పలుకుబడితో విచ్చిన్నం చేయడమే కాకుండా వ్యవస్థను తనకు అనుకూలంగా చేసుకున్నటువంటి జ్యోతి గారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కొట్టం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Comment List