నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి భాను ప్రకాష్ ఆత్మహత్య.
హాస్టల్ లో ఊరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న విద్యార్ధి భాను ప్రకాష్
నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి భాను ప్రకాష్ ఆత్మహత్య.
హాస్టల్ లో ఊరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న విద్యార్ధి భాను ప్రకాష్
నంద్యాల . ఆగస్ట్ 23 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా పాణ్యం మండలం వద్ద ఉన్న ఆర్ జి ఎం ఇంజనీరింగ్ కళాశాలలో బి టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధి బాను ప్రకాష్ (19) ఆత్మ హత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఉదయం విద్యార్థులు క్లాస్ కు వెళ్లిన తరువాత విద్యార్ధి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలుస్తుంది..భాను ప్రకాష్ స్వస్థలము.కడప జిల్లా, పులివెందుల దగ్గర తాటిరెడ్డిపల్లి గ్రామంగా తెలుస్తుంది. విద్యార్ధి ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నాడనే కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.విద్యార్ధి ఆత్మ హత్య చేసుకోవడానికి ప్రదానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి.కళాశాల యాజమాన్యం ఫీజు కట్టాలని ఒత్తిడి చేయగా అవమానం గా ఫిల్ అయి ఆత్మ హత్య చేసుకున్నాడని ఒక వాదన ఉండగా.. ఆన్లైన్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో ఏమి చేయాలో తెలియక ఆత్మ హత్య చేసున్నాడని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని నేను చనిపోతున్నట్లు తండ్రికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. . ఆ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..పోస్ట్ మార్టం నిమిత్తం విద్యార్ధి మృత దేహాన్నినంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పాణ్యం పోలీసులు వెల్లడించారు.
మా అబ్బాయిని కళాశాల యాజమాన్యమే చంపింది..
మా అబ్బాయిని కళాశాల యాజమాన్యమే చంపిందని విద్యార్ధి బాను ప్రకాష్ తల్లి ఆరోపించింది.. ఇంతమంది సిబ్బంది ఉన్నా మా కొడుకు ఎలా చనిపోయాడని విలపించింది.. ఆర్జీఎం కాలేజీని మూసివేయాలని, తన కొడుకు చనిపోయిన విషయం కూడా మాకు తెలియజేప్పలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కళాశాలను ముసివేయాలని డిమాండ్ చేసింది..
విద్యార్ధి మృతిపై సీబీ ఐ చే విచారణ చేయించాలి..
విద్యార్ధి సంఘాలు డిమాండు..
విద్యార్థి మృతికి కారణమైన ఆర్ జి ఎం కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తక్షణమే కళాశాలను మూసివేయాలని మన విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న భాను ప్రకాష్ ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకోవడం పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.. కళాశాల ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ఆర్ జి ఎం కళాశాల కేరఫ్ అడ్రస్ గా మారిందని ఇప్పటికైనా ఒక మంచి విద్యార్థులు ఆ కళాశాలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. అధికారులు పోలీసులు ప్రేక్షకు పాత్ర పోషిస్తున్నారని విధాత సంఘాల నాయకులు ఆరోపించారు.. లోకల్ గా విచారణ జరిపిస్తే మేం జరగదని కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించి కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు..
Comment List